లేటెస్ట్ : “ధమాకా” సినిమాని వారికి అంకితం చేసిన రవితేజ.!

మొట్టమొదటిగా మా “తెలుగు రాజ్యం” వీక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక మూవీ న్యూస్ లోకి వెళితే గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీ లీల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ హిట్ సినిమా “ధమాకా” తో ఏడాది సూపర్ హిట్ గా ముగిసింది.

ఇక ఈ సినిమా సూపర్ రన్ తోనే కొత్త ఏడాది కూడా మొదలు కాగా ఈ సినిమా సక్సెస్ పై అయితే రవితేజ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా విజయం కోసం మాట్లాడుతూ 2022 లో ధమాకా సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని..

ఇదొక మెమొరబుల్ సక్సెస్ కాగా ఈ సినిమా సక్సెస్ ని అయితే గత ఏడాది మనం కోల్పోయిన ఎందరో లెజెండరీ నటులకి అంకితం చేస్తున్నానని రవితేజ తెలిపాడు. ఇలా ఎంతో ప్రేమని అయితే అందిస్తున్న అభిమానులుకి ఋణపడి ఉంటానని మరింత ముందుకు వెళ్తానని తెలిపారు.

ఇక ఈ కొత్త ఏడాది 2023 ని కూడా అదిరే బ్యాంగ్ తో చేద్దామని అయితే తాను తెలిపి ముగించారు. ఇక ఈ చిత్రం అయితే త్రినాథరావు నక్కిన తెరకెక్కించగా ఈ ఏడాది మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు తాను చేస్తున్నాడు.