డైలమాలో రష్మిక.! చేస్తుందో లేదో మరి.!

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా కోసం రష్మికతో స్పెషల్ సాంగ్ చేయించనున్నారనే ప్రచారం తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. రష్మిక మండన్న వరుస ప్రాజెక్టులతో బిజీగా వుంది. ఈ తరుణంలో స్పెషల్ సాంగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్.? అన్న మీమాంశలో వుందట రష్మిక. అయితే, రెమ్యునరేషన్ పరంగా సూపర్బ్ డీల్ గనుక, వదులుకోవడానికి రష్మిక సిద్ధంగా లేదని అంటున్నారు.

ఇదిలా వుంటే, త్రివిక్రమ్ – మహేష్ సినిమా బాలారిష్టాల్ని ఎదుర్కొంటోంది. సినిమా ఏ ముహూర్తాన ప్రారంభమయ్యిందోగానీ, ముందుకు కదలడానికి నానా రకాల ఇబ్బందులూ పడుతోంది.  ఈ నేపథ్యంలో సినిమాకి డేట్స్ కేటాయించడం ఎలా.? అన్న డైలమాలో పడిపోయిందట రష్మిక. త్రివిక్రమ్‌తో సినిమా చేయలనుందంటూ ఓ సినిమా ఫంక్షన్‌లో నేరుగా ఆయన్నే అడిగేసిన రష్మిక, ఆ అవకాశం వస్తే ఇప్పుడు వదులుకునే పరిస్థితి వుంటుందా.? రష్మిక కాకపోతే ఎవరు.?

అన్న కోణంలో చిత్ర యూనిట్ కూడా ఇంకో ఆప్షన్‌ని సిద్ధం చేసుకుందనీ, బాలీవుడ్ బ్యూటీనే ఆ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వుందనీ తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి.