తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలవడానికి రాజమండ్రి రావొచ్చు అనే వార్త తమిళ మీడియాలో వస్తోంది. చంద్రబాబుకి ధైర్యం చెప్పడానికి జైల్లో అతన్ని కలిసే అవకాశం వుంది అని అంటున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ మంచి మిత్రులన్న సంగతి అందరికి తెలిసిందే. ఎన్నో సార్లు రజినీకాంత్ తన మిత్రుడు చంద్రబాబు గురించి మంచి మాటలు చెప్పారు, అలాగే ఆమధ్య ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబుని ఎంతో ప్రశంసించారు రజినీకాంత్.
కొన్ని రోజుల క్రితం చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కూడా అతను క్లీన్ గా బయటకి వస్తాడు అని చెప్పారు, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌తో మాట్లాడి అతనికి ధైర్యం చెప్పారు. అయితే ఇప్పుడు తమిళ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. రజనీకాంత్ త్వరలో రాజమండ్రి జైల్లో వున్న చంద్రబాబును కలుస్తారు అని.
ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అయింది. తనకి మంచి మిత్రుడు అయిన చంద్రబాబు జైల్లో ఉంటే, ధైర్యం చెప్పడానికి రజనీకాంత్ అతన్ని రాజమండ్రి జైల్లో కలవనున్నారు అని అంటున్నారు. అయితే ఈ వార్త ఇంకా ధ్రువీకరించలేదు కానీ, తమిళ మీడియా లో మాత్రం బాగా వైరల్ గా మారింది.