RRR: చరణ్ దాచుకోగలడు, ఎన్టీఆర్ అమాయకుడు… జక్కన్న షాకింగ్ కామెంట్స్..!

RRR:రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటిసారిగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా జనవరికే పూర్తయి విడుదలకు సిద్ధమైన కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇపుడు మార్చి 25 న విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్టార్ డైరెక్టర్ రాజమౌళి 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా కళ్లు చెదిరే విజువల్స్ తో తెరకెక్కించారు.ఈ సినిమాపై ఇప్పటికే ఇంటర్వ్యూల ద్వారా జక్కన్న అంచనాలను పెంచేశారు.ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యుల్లో ఆయన మాట్లాడుతూ..

రామరాజు పాత్రకు చరణ్ ను, భీమ్ పాత్రకు తారక్ ను తీసుకోవడం గురించి రాజమౌళి స్పందిస్తూ,పాత్ర ప్రకారం భీమ్ మనస్సులోని భావాలను దాచుకోలేడని అమాయకమైన వ్యక్తి అని అందువల్ల ఆ పాత్రకు ఎన్టీఆర్ ను ఎంపికచేశామని, అగ్నిని గుండెలలో దాచుకున్న స్థితప్రజ్ఞత ఉండాలని చరణ్ లో అది ఎక్కువ ఉంటుంది కాబట్టి అతనిని ఆ పాత్రకు ఎంపిక చేశామని తెలిపారు.కష్టం వచ్చినా సుఖం వచ్చినా తొణకడు కాబట్టి ఆ పాత్రను చరణ్ కు ఇచ్చానని రాజమౌళి అన్నారు.

ఇంకా, రామ్ చరణ్ ఎన్టీఆర్ ల గురించి మాట్లాడుతూ, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా తీయ్యకముందు నుండే మంచి ఫ్రెండ్స్. ఇక వాళ్లతో నా వారి వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందంటే.. ఎన్టీఆర్ ని చూసినప్పుడల్లా నాకు ఒక కంప్యూటర్ లా అనిపిస్తాడు. ఎందుకంటే.. మాలులు గ్రాస్పింగ్ పవర్ కాదు. మనం ఏదైన చెప్పితే చాలు దాని టక్కున పట్టేస్తాడు. మనకు కావాల్సిన విధంగా నటించేసి..రెండోసారి చెప్పించే పనిలేకుండా చేస్తాడు. అంతేకాదు ఒకటి చెప్పిన చాలు వెంటనే రెండోది పట్టెస్తాడు.అదే చరణ్ విషయానికి వస్తే.. మాత్రం నాకు ఓ వైట్ పాపర్ లా అనిపిస్తాడు. ఆ కాగితంలో మనం అద్భుతం రాస్తే మహాద్భుతం చేస్తాడు. ఎందుకంటే..మనం ఏదైన సీన్ , డైలాగ్ చెప్పిన తర్వాత చాలా సేపు ఆలోచిస్తాడు. దాని కోసం బాగా కసరత్తులు చేసి..ఫైనల్ ఓఉట్ పుట్ పర్ ఫెక్ట్ లా ఉండేలా చూసుకుంటాడు’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ గురించి మొదటినుంచి చెబుతున్నానని ఈ సినిమా ఫిక్షనల్ అని బయోపిక్ కాదని రాజమౌళి వెల్లడించారు.ఈ సినిమా కథ, పాత్రలు అంతా కల్పితమే అని జక్కన్న  తెలియజేశారు.ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేయడం లేదని ఇది సింగిల్ మూవీ అని జక్కన్న వెల్లడించారు.