బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే సోషల్ మీడియాలో పది మందికి పనికి వచ్చే విషయాలను పంచుకుంటూ ఉంటుంది. వ్యాయామం, సౌందర్య చిట్కాలు, ఆరోగ్యమైన ఆహారాన్ని తయారుచేసుకోవడం వంటి విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటుంది. బిగ్ బాస్ వల్ల ఇమేజ్ను పునర్నవి అవకాశాలుగా మార్చుకోలేకపోతోంది.
బిగ్ బాస్ అనంతరం పునర్నవి ఎలాంటి ఆఫర్లు రాలేదు. ఈ మధ్యే ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. కమిట్‌మెంటల్ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే దానికి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. రెండో సీజన్ మీద మరో అప్డేట్ ఇంత వరకు ఇవ్వలేదు. అయితే పునర్నవి మాత్రం నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె వేసే కౌంటర్లు, స్పందించే తీరుకు అందరూ షాక్ అవుతుంటారు.
తనపై వచ్చే ట్రోలింగ్‌కు పునర్నవి స్పందిస్తూ ఉంటుంది. మీడియా తన మీద, బాడీ షేమింగ్ గురించి రాసే వాటిపై ఆ మధ్య గట్టిగానే కౌంటర్ వేసింది. అలా ఎప్పటికప్పుడు పునర్నవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. బీచ్‌లో సేద తీరడం అంటే పునర్నవికి మహా సరదా అన్న విషయం తెలిసింది. తాజాగా పునర్నవి సముద్ర తీరంలో సేద తీరుతున్న ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె చేసిన అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.