బిగ్ బాస్ షోకి సంబంధించిన ప్రతి సీజన్‌లో ఓ రొమాంటిక్ జంట రచ్చ చేయడం కామన్‌గా మారింది. బిగ్ బాస్ సీజన్ 3 విషయానికి వస్తే రాహుల్- పునర్నవి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి కథనాలు కొల్లలు కొల్లలుగా వచ్చాయి. ఒకరిని వదిలి ఒకరం ఉండలేనంతగా వీరు బిల్డప్ ఇవ్వడంతో నెటిజన్స్ చాలా ఊహించుకున్నారు. బయటకు వచ్చాక కూడా పలు షోస్‌కు, ఈవెంట్స్‌కు ఇద్దరు కలిసే వచ్చారు. ఎక్కడకు వెళ్లిన ఇద్దరికి ఒకటే ప్రశ్న.. మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అని? దీనికి స్మార్ట్‌గా సమాధానం ఇచ్చి తప్పించుకుంటూ వస్తున్నారు.
ఇటీవల పునర్నవి ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని తెగ నటించేసింది. తీరా చూస్తే వెబ్ సిరీస్‌లో భాగంగా పునర్నవి ఆడిన కొత్త డ్రామా అని తెలుసుకున్నారు. అయితే తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని పునర్నవి చెప్పడంతో రాహుల్ ఫ్యాన్స్ షాకయ్యారు. ఇదేంది వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ సోసోగా మారిందా అంటూ ముచ్చటించుకున్నారు. కాస్త టెన్షన్ కూడా పడ్డారనుకోండి, అది వేరే విషయం. కట్ చేస్తే ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం పునర్నవికి కాస్త దూరంగా ఉంటూ మరో బిగ్ బాస్ బ్యూటీతో కథ నడిపిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.
రాహుల్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అషుతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. బ్యాక్ టు అవర్ రియల్ రిలేషన్ షిప్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో నెటిజన్స్ కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. అసలు ఏం జరుగుతుంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అషు జూనియర్ సమంతగా చాలా ఫేమస్. సీక్రెట్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పేరుని టాటూగా వేయించుకొని మరింత ఫేమస్ అయింది. ఓ ఆల్బంలో రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి ముద్దు సీన్ చేసింది. తెలుగులో మంచి పేరున్న అషూ.. రాహుల్‌తో రిలేషన్‌పై ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.