పునర్నవి భర్త, బిడ్డ ఫోటోలు లీక్..

ఉయ్యాల జంపాల సినిమా తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది పునర్నవి భూపాలం. శర్వానంద్ నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా లో కూడా ఒక పాత్ర చేసింది పునర్నవి. అయితే బిగ్ బాస్ 3 సీజన్ తో మాత్రమే అభిమానులకు ఎక్కువగా చేరువైంది. బిగ్ బాస్ హౌస్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంకా పునర్నవి మధ్య సాగిన లవ్ ట్రాక్ బాగా సక్సెస్ అయింది అనే చెప్పుకోవాలి. అయితే ‘ఎందుకో ఏమో’, ‘ ఒక చిన్న విరామం’, ‘ సైకిల్ ‘ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ పునర్నవి కి అంత గుర్తింపు తెచ్చి పెట్టలేదు. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది పునర్నవి. ఇవేవీ పునర్ణవి కెరీర్ కు అంతగా కలిసి రాలేదు.

అయితే ప్రస్తుతం పునర్నవి నటనకు దూరంగా ఉంటూ లండన్ లో చదువుకుంటుంది అని సమాచారం. అక్కడికి వెళ్ళినా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా నే ఉంటుంది. అక్కడ ఫ్రెండ్స్ తో తను ఎంజాయ్ చేస్తున్న సంఘటనలను, సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులకు చేరువగానే ఉంటోంది. అయితే తాజాగా పునర్నవి కి లండన్ లోనే ఒక అబ్బాయితో పెళ్ళి జరిగిందని పిల్లలు కూడా పుట్టారు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి కారణం ఈ మధ్యనే పునర్నవి ఒక అబ్బాయితో తో క్లోజ్ గా వున్న ఫోటో ను లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అంటూ షేర్ చేసింది. అంతేకాకుండా ఒక చిన్న బాబుతో తన ఫోటోలను షేర్ చేస్తు తన ఆనందాన్ని పంచుకుంది
వీటితో పాటు తాజాగా ఒక హౌస్ వార్మింగ్ పార్టీ వీడియోను కూడా షేర్ చేయడంతో అందరూ పునర్నవి లండన్లోని ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుందని పిల్లల్ని కూడా కని అక్కడే సెటిల్ అయిందని అనుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఫోటోలో పున్ను తో క్లోజ్ గా ఉన్న ఆ అబ్బాయి పునర్నవి కి స్నేహితుడు అంట. అంతేకాదు అతడొక ఒక గే అంటున్నారు. అయితే ఆ చిన్న బాబు పునర్నవి వాళ్ళ రిలేటివ్స్ కి సంబంధించిన బాబు. అయితే పునర్నవి పెళ్లి, పిల్లల మీద వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.