పునర్నవి అంటే ఏంటో, ఎంత కొంటెగా ఉంటుందో.. ఎంత అల్లరి చేస్తుందో అందరికీ తెలిసిందే. రాహుల్‌ను ఎంతగా ఆడుకుందో.. ఎంత ఏడిపించిందో మనమంతా చూశాం. రౌడీ పిల్లగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే చిన్నతనంలోనూ పునర్నవి అంతే అల్లరిగా, రౌడీ దానిలా ప్రవర్తించేదట. తాజాగా శ్రీముఖి ఉమెనియా షోలో పాల్గొన్న పునర్నవి చిన్నతనంలో చేసిన కొంటె పనులను చెప్పింది. పదో తరగతి చదువుతున్నప్పుడు జరిగిన ఘటన గురించి వివరించింది.
ఓ రోజు స్కూల్ గోడ దూకి తన ఫ్రెండ్‌తో కలిసి స్కూటీ మీద సినిమాకు బయల్దేరిందట. అయితే తనకు రన్నింగ్ బస్‌ను టచ్ చేయాలనే కోరిక ఉండేదట. స్కూటీలో వెళ్తుంటే అలా బస్‌ను వెనకనుంచి టచ్ చేయాలని ప్రయత్నించిందట. ఈ క్రమంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుందట. అలా బస్‌ను టచ్ చేయడం వరకు బాగానే ఉంది కానీ డ్రైవింగ్ చేస్తున్న పునర్నవి ఫ్రెండ్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో కిందపడిపోయారట.
అలా సడెన్‌గా పనిపోవడంతో పునర్నవి మోకాలు చిప్ప పగిలిపోయిందట. అక్కడ జాయింట్ పక్కకి జరిగిందట. తన ఫ్రెండ్‌కు నుదుటిపై దెబ్బలు తగిలి కుట్లు పడ్డాయట. మెకాలుకు తగిలిన దెబ్బ ఇంకా బాధిస్తునే ఉంటుందట. సరిగ్గా కిందకు వంగలేనని, యోగా చేసేప్పుడు ఆ కాలుతో సరిగా ఆసనాలు వేయలేనని చెప్పింది. మొత్తానికి కొంటె పనులు చేసి ఇలా దెబ్బలు తగిలించుకున్నానని చెప్పుకొచ్చింది.