బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఎంత బాగా కలిసి ఉంటారో అందరికీ తెలిసిందే. లోపల ఎన్ని గ్రూపుల్లా ఉన్నా కూడా బయటకు వచ్చాక దాదాపు అందరూ కలిసి మెలిసే ఉంటున్నారు. ఎవరింట్లో ఏ ఈవెంట్ జరిగినా కూడా అందరూ వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా అలీ రెజా తన భార్యతో కలిసి వస్తుంటాడు. ఇక శివజ్యోతి తన భర్త గంగూలితో కలిసి వెళ్తుంది. ఎక్కువగా శివ జ్యోతి ఇంట్లోనే గెట్ టుగేదర్‌లా ప్రతీ పండుగకు సెలెబ్రేషన్స్ జరుగుతుంటాయి.
అయితే ఈ సారి మాత్రం ఆ సందడి వితిక షెరు ఇంట్లో జరుగుతోంది. రెండ్రోజుల క్రితమే వితిక షెరు చెల్లి కృతిక షెరు నిశ్చితార్థం జరిగింది. ఇక నిన్న పెళ్లి కూడా జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. నిశ్చితార్థం వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవ్వరూ కూడా కనిపించలేదు. కేవలం పునర్నవి మాత్రం రచ్చ రచ్చ చేసింది. కానీ పెళ్లిలో మాత్రం పునర్నవి కంటే మించి సందడిచేసే వారంతా వచ్చేశారు.
వితిక ఇంట్లో పెళ్లికి మూడో సీజన్ కంటెస్టెంట్లు మాత్రమే కాదు నాల్గో సీజన్ కంటెస్టెంట్లు కూడా వచ్చారు. శివజ్యోతి, హిమజ, లాస్య, మసూమ (అలీ రెజా భార్య), రవికృష్ణ, గంగూలి (శివ జ్యోతి భర్త), మంజునాథ్ (లాస్య భర్త) ఇలా అందరూ కలిసి సందడి సందడి చేశారు. మొత్తానికి ఈ పెళ్లి మాత్రం ఇలా బిగ్ బాస్ రీ యూనియన్‌లా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వారి సందడి తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ పెళ్లిలో మాత్రం రాహుల్ ఎక్కడా కూడా కనిపించడం లేదు.