రామ్ చరణ్-శంకర్ మూవీ న్యూ అప్డేట్ !

Producer Dil Raju gave a new update about Ram Charan and Shankar movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి క్రేజీ మూవీస్ తర్వాత ఏస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నెవెర్ బిఫోర్ కాంబినేషన్ పై ప్రేక్షకుల అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. తాజగా నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ ​లో షూటింగ్ ప్లాన్ చేశామని వెల్లడించారు. ఇప్పటికే ఆచార్య మూవీలో చెర్రీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ఆగష్టు నెలలో పూర్తి కానుందని సమాచారం. దాంతో చెర్రీ,శంకర్ మూవీని సెప్టెంబర్లో స్టార్ట్ చేసేందుకు ఫ్రీగా ఉంటాడు.

Producer Dil Raju gave a new update about Ram Charan and Shankar movie

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. తన ప్రతి సినిమాలో ఏదొక సామాజిక సమస్య మీద అవగాహన కల్పించే శంకర్ ఇందులో ఎలాంటి అద్భుతం చేస్తారో అని మెగా అభిమానులు చర్చిస్తున్నారు. ఇక ఈ సినిమాకు టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… కొరియోగ్రాఫర్​గా జానీ మాస్టర్ ను ఫైనల్ చేశారు. అయితే చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది.