వైరల్ : ఆ ప్రాజెక్ట్ లో హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ లుక్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తెలుగు సహా హిందీ మరియు కన్నడ దర్శకుల సినిమాతో యమ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే లేటెస్ట్ గా ఎలాంటి హంగామా లేకుండా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేస్తున్న సినిమా కూడా ఒకటి. ఆ సినిమానే “రాజా డీలక్స్”(పరిశీలనా టైటిల్) కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ అయితే తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో అయితే ప్రభాస్ చాలా కాలం తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో నటిస్తుండగా ఇప్పుడు షూటింగ్ హైదరాబాద్ భారీ సెట్స్ లో శరవేగంగా కంప్లీట్ అయ్యిపోతుంది. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ ఈ సినిమాలో లుక్ ఇప్పుదు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా నుంచి ఇపుడు కొన్ని ఆన్ లొకేషన్ ఫోటోలు బయటకి రాగా ఇవి చూసి అయితే ప్రభాస్ ఫాన్స్ ఒకింత షాకవుతున్నారని కూడా చెప్పాలి. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి ప్రభాస్ గెటప్ అంతా కూడా మారిపోయింది. తన డ్రెస్సింగ్ గాని తన హెయిర్ స్టయిల్ గాని అంతా కొత్త ప్రభాస్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాడు.

దీనితో ఇన్నాళ్లు మారుతిని తిట్టుకున్నా వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. దీనితో ప్రభాస్ లేటెస్ట్ క్రేజీ లుక్ మాత్రం ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా కనిపించనుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.