ప్రభాస్ బర్త్ డే స్పెషల్..రీ రిలీజ్ కానున్న యాక్షన్ ఫిలిం రెబల్.. ఏర్పాట్లలో అభిమానులు?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈ హీరో అక్టోబర్ 23వ తేదీ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఇప్పటికే తన అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తుంది. హీరోల పుట్టినరోజు వస్తుంటే ఆ రోజున ఆ హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా ఉన్నటువంటి సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన పోకిరి పవన్ కళ్యాణ్ జల్సా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తిరిగి విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టాయి.ఈ క్రమంలోనే అక్టోబర్ 23వ తేదీ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ప్రభాస్ కెరియర్లో యాక్షన్ ఫిలిం గా నిలిచిన రెబల్ సినిమాని తిరిగి విడుదల చేయడానికి అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టినరోజు 23వ తేదీ కావడంతో 15వ తేదీని ఈ సినిమాని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారు కూడా నటించారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించారు.ఇక కృష్ణంరాజు గత నెల 11వ తేదీ అనారోగ్య సమస్యలతో మరణించారు అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరు కలిసి నటించిన సినిమాని రీ రిలీజ్ చేయాలని పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన సలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు.