Pawan Kalyan: డప్పు కొట్టి గిరిజనులతో డాన్స్ చేసిన డిప్యూటీ సీఎం.. నెట్ నెట్టింట ఫొటోస్,వీడియోస్ వైరల్!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత రెండు మూడు రోజులుగా మన్యం జిల్లాలోని పలు గ్రామాలను మండలాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి పరిస్థితులను వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు అక్కడి ప్రజలతో ముచ్చటించి వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేని గ్రామాలను రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్. గిరిజన గ్రామాల అభివృద్ధి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

అయితే ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అరకు ప్రాంత గిరిజన సంప్రదాయ నృత్యం థింసాను అక్కడి థింసా మహిళా నృత్య కళాకారులతో కలిసి చేశారు. అంతేకాకుండా గిరిజన ఆడబిడ్డల దగ్గర ఒక గిరిజన పాట కూడా నేర్చుకున్నారు. ఆ మహిళ పాడుతుంటే పవన్ కూడా ఆమెతో కలిసి పాడారు. అలాగే అక్కడి డప్పు కళాకారుల దగ్గర డప్పుని కొట్టి సంతోషపరిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

ఇక రోడ్లు కూడా లేని గ్రామాల్లోకి వర్షం పడుతున్నా బురదలో నడుచుకుంటూ వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ అక్కడి గ్రామాల్లోని ప్రజలతో మాట్లాడి గిరిజన గ్రామాల అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ని అభినందించారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన డ్యాన్స్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు ఆ పార్టీ నేతలు. ఒకవైపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఇలా ప్రస్తుతం సినిమాలు రాజకీయాలు అంటూ రెండు వైపులా ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.