Pawan Kalyan: ఓజీ సినిమా అంటూ అరుపులు, కేకలు.. ఫ్యాన్స్ పై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: డిప్యూటీ సీఎం, టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒకవైపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. అక్కడ బాగుజోలా అనే గిరిజన గ్రామంలోని రోడ్లను అక్కడి పరిసరాలను కూడా పరిశీలించారు. ఆ తర్వాత అక్కడున్న ప్రజలతో ముచ్చటించారు.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రజలతో కలిసి ముచ్చటిస్తున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కొంతమంది యువత ఓజీ అంటూ సినిమా గురించి అరిచారు. దీంతో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ అయి కామెంట్స్ చేసారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నన్ను పనిచేసుకోనివ్వండి. నా చుట్టు ముట్టేస్తే నేను పని చేసుకోలేను. రోడ్లు ఎలా ఉంటాయో చూద్దామంటే మీరంతా చుట్టు ముట్టేసి రోడ్లు కనపడట్లేదు. యువతకు ఒకటే చెప్తున్నా మీరు ఇప్పుడు సినిమాల మోజులో పడి, పోస్టర్లు పెట్టి ఓజీ, ఓజీ అని, లేదా వేరే హీరోలకు జేజేలు కొడుతున్నారు. ఇవన్నీ చేయవచ్చు కానీ మీరు మీ జీవితంపై ఫోకస్ చేయకపోతే ముందుకు వెళ్ళలేరు.

మాట్లాడితే అన్న మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, నేను ఛాతి కొట్టుకుంటే రోడ్లు పడవు, నేను వెళ్లి సీఎం, పీఎంలను అడిగితే రోడ్లు పడతాయి. అందుకే నేను మీసాలు తిప్పడాలు, ఛాతులు కొట్టుకోడాలు చేయను. నన్ను పని చేసుకోనివ్వండి అని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది మా పవర్ స్టార్ అంటే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.