బాక్సాఫీస్ : 6 రోజుల్లో “పఠాన్” వరల్డ్ వసూళ్లు ఎంత.!

కింగ్ ఖాన్ లేదా బాలీవుడ్ బాద్షా ఎలా అయినా పిలుచుకునే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం “పఠాన్” తో తాను ఓ సరైన కమర్షియల్ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో తాను చూపిస్తున్నాడు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ భారీ ఏక్షన్ మరియు ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా అంచనాలు అందుకోవడమే కాకుండా.

అంతకు మించిన మైండ్ బ్లాకింగ్ రికార్డు ఫిగర్స్ ని బాక్సాఫీస్ దగ్గర నమోదు చేస్తూ వండర్స్ సెట్ చేస్తుంది. అలా లేటెస్ట్ గా ఈ భారీ సినిమా 6 రోజుల్లో రికార్డు మొత్తం వసూళ్లు కొల్లగొట్టినట్టుగా చిత్ర నిర్మణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ అనౌన్స్ చేసింది. మరి పఠాన్ ఈ కొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 591 కోట్ల గ్రాస్ ని అందుకుందట.

మరి వీటిలో ఇండియన్ సినిమా గ్రాస్ వసూళ్లే 367 కోట్లు వసూలు చేయగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి 224 కోట్లు ఈ 6 రోజుల్లో వచ్చాయి. దీంతో పఠాన్ చిత్రానికి ఈ 6 రోజుల్లో ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి. సోమవారం ఆటోమేటిక్ గా డ్రాప్ ఉంటుంది కాబట్టి 6వ రోజుకి 600 కోట్ల మార్క్ ని ఈ చిత్రం జస్ట్ లో మిస్ అయ్యింది.

ఇక మరో పక్క ఓన్లీ హిందీ మార్కెట్ లో 300 కోట్లు అందుకున్న ఫాస్టెస్ట్ సినిమాగా ఇది రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తుంది. మరి ఫైనల్ రన్  అని ఆడియెన్స్ సహా ఖాన్ ఫ్యాన్స్ చూస్తున్నారు.