నిఖిల్ కష్టం పగవాడికి కూడా రాకూడదు..!

యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండిటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా జులై 22వ తేదీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఆగస్టు 5వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఆరోజు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా విడుదల కావడంతో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా విడుదల మరొక వారం వెనక్కు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆగస్టు 12వ తేదీ విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఇక ఆగస్టు 12వ తేదీ విడుదల కాబోతుందని చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ సినిమా ఆగస్టు 12 కాకుండా 13వ తేదీకి వాయిదా పడింది.ఇలా ఈ సినిమా మరొకరోజు వెనక్కి వెళ్లడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మరికొందరు నిఖిల్ కష్టం పగవాడికి కూడా రాకూడదని కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఉద్దేశపూర్వకంగానే నిఖిల్ సినిమాపై కక్ష సాధిస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నిఖిల్ ఈ సినిమాని విడుదల చేయడం కోసం ఎంతో కష్టపడ్డారని కనీసం సినిమా విడుదలకు థియేటర్లో కూడా దొరక్కుండా ఉన్నాయని ఈ సినిమాని ఇప్పుడు కాకుండా సెప్టెంబర్ లోను అక్టోబర్ లోను విడుదల చేసుకోండి అంటూ సలహా ఇవ్వడంతో తాను ఏడ్చేసానని గత ఇంటర్వ్యూలలో నిఖిల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా 12వ తేదీ విడుదల కాబోతుందని సంతోషం పడటంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడుతూ అందరిని షాక్ గురిచేస్తుంది.