నయనతార,విఘ్నేష్ పెళ్లి పనులుమొదలు.. మొదటి పెళ్లి పత్రిక వారికే..?

కోలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. నయనతార,విఘ్నేష్ లు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత వీరి పెళ్లి పలు సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ కోలీవుడ్ జంట వివాహబంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.

త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న జంట పెళ్ళి పనులు ఇప్పటికే మొదలు అయ్యాయి. జూన్ 9న ఈ జంట ఇక్కడి కాబోతోంది. అయితే పెళ్లికి మరికొద్ది రోజులే సమయం ఉండటంతో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు నయనతార విగ్నేష్ లు. అయితే వారి పెళ్లి ఏర్పాట్లను వారిద్దరూ దగ్గరగా ఉండి స్వయంగా చేసుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి తిరుమల తిరుపతి వేదికగా మారింది. తిరుమలలో పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయికున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెళ్ళికి ముందే ఈ జంట ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.

తాజాగా ఇటీవలే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో వారి పెళ్లి జరగనున్న కళ్యాణ మండపం కూడా వీక్షించారు. ఇప్పటికే వీరి పెళ్లి పత్రికలు కూడా రెడీ అయ్యాయి. అయితే మొదటి పెళ్లి పత్రిక ను విగ్నేష్ ఇంటి దేవుడు పాదాల వద్ద తొలి పెళ్లి పత్రికను పెట్టినట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే కోలీవుడ్ లో పెళ్లి బాజలుల మోగనున్నాయన్నమాట. ఈ విషయం తెలుసుకున్న వీరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావాల్సిన ఈ జంట పెళ్లి పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అలా ఎట్టకేలకు జూన్ 9న వీరిద్దరు ఒకటి కాబోతున్నారు.