సమంత ని కలవనున్న నాగచైతన్య…మళ్ళీ ఒక్కటికానున్నారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమాలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి మంచి ఆఫర్లు అందుకుంటూ ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా కొంతకాలంగా సమంత ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సమంత కొంత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెరుగైన వైద్యం కోసం సమంత దక్షిణ కొరియా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సమంత దక్షిణ కొరియా నుండి తిరిగి రాగానే నాగచైతన్య ఆమెను కలవనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చాలా కాలం ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత వేరే కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ జంట కొంతకాలానికి ఒకరికొకరు దూరమయ్యారు. ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందిన వీరిద్దరూ విడాకులు తీసుకొని వారి అభిమానులు చాలా ఆందోళన చెందారు. నాగచైతన్యకు దూరమైన సమంత కొంతకాలం డిప్రెషన్లో ఉండిపోయింది. ఆ బాధ నుండి బయటపడటానికి స్నేహితులతో కలిసి దైవదర్శనాలు చేసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించింది.

అంతేకాకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ బాధ నుండి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో కొంతకాలం క్రితం సమంత మాయాసైటిస్ అనే వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంది. ఆమె తొందరగా కోలుకోవాలని సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు కూడా ప్రార్థిస్తున్నారు. అయితే సమంత అనారోగ్యం గురించి తెలిసిన నాగచైతన్య మాత్రం ఇప్పటివరకు ఆమెను కలవలేదు. అందువల్ల ట్రీట్మెంట్ కోసం దక్షిణ కొరియా వెళ్లిన సమంత తిరిగి రాగానే చైతన్య తన పట్టింపులను విడిచి సమంతని కలవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ మల్లి ఒక్కటి అయ్యే అవకాశాలు ఉన్నాయని వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.