Keerthy Suresh: దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిల్‌తో ఏడడుగులు వేయబోతున్నారంటూ తమిళ మీడియాతో పాటు ఇటు తెలుగులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో కీర్తి తాజాగా కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. తన బాయ్‌ఫ్రెండ్‌ను కీర్తి సురేశ్ తాజాగా పరిచయం చేశారు. ఆంటోని తట్టిల్‌తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ఇద్దరూ సూర్యుడివైపు చూస్తున్న ఓ అందమైన ఫొటోను పంచుకున్నారు. ట్వీట్‌కు లవ్ సింబల్‌తో అని క్యాప్షన్ పెట్టారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు, నెటిజన్లు కీర్తికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆంటోనీ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. వీరిద్దరూ కలిసి ఒకే పాఠశాలలనే చదివినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ హైస్కూల్ ప్రేమికులు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా, డిసెంబర్ రెండో వారంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సమాచారం. డిసెంబర్ 11, 12 తెదీల్లో గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోందంట. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలిసింది. అయితే, తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయిన కీర్తి సురేశ్.. పెళ్లి గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.