దేవీ నాగవల్లి ఎలిమినేట్ కావడానికి కారణమిదే.. కౌశల్ విశ్లేషణ

Kaushal Manda Explanation On devi Nagavalli Elimination

బిగ్‌బాస్ 4 సీజన్‌లో మూడో వారంలో జరిగిన ఎలిమినేషన్ అందరికీ ఆశ్చర్యానికి కలిగించింది. నాల్గో సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన దేవీ నాగవల్లి ఎలిమినేట్ అవ్వడం ఆమెతో పాటు మిగిలిన కంటెస్టెంట్లందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే ఈ ఎలిమినేషన్‌పై జనాల్లో కూడా కొద్దిగా అనుమానాలున్నాయి. దేవీ నాగవల్లి కంటే మెహబూబ్, కుమార్ సాయి, ఆరియానా వంటి బెటరా? వాళ్లకే తక్కువ ఓట్లు వచ్చాయి అయినా దేవీ నాగవల్లిని ఎందుకు ఎలిమినేట్ చేశారని అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.

Kaushal Manda Explanation On devi Nagavalli Elimination
Kaushal Manda Explanation On devi Nagavalli Elimination

బయటకు వచ్చిన దేవీ నాగవల్లి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను లోపల ఉంటే వారు అనుకున్నవి చేయలేకపోతున్నారనే తనను బయటకు పంపించి ఉంటారేమో అని దేవీ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇలాంటి అపోహలన్నింటిని తొలగించేందుకు బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. మామూలుగా కౌశల్.. ఈ మధ్య ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లందరితోనూ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.

అయితే కొద్దిగా బిజీగా ఉండటం వల్ల దేవీ నాగవల్లితో ఇంటర్వ్యూ చేయలేకపోతున్నానని తెలిపాడు. అయితే ఆడియన్స్ ఓట్ల ద్వారానే ఎలిమినేషన్ ఉంటుందని, మరేతర కారణాలతోనూ ఎలిమినేట్ చేసే అవకాశమే ఉండదని తెలిపాడు. అయితే దేవీ నాగవల్లి ఇంట్లో ఒకే రకంగా ఉండకపోవడం.. ఉంటే హై రేంజ్‌లో లేదా మరీ కనబడకుండా ఉండేదని అన్నాడు. ఆమె గ్రాఫ్ అలా పెరుగుతూ అలా కిందకు వచ్చేదని అందుకే ప్రేక్షకులు కూడా ఆమెను జడ్జ్ చేయలేకపోయారని, అమ్మ రాజశేఖర్ విషయంలోనూ దేవీ నాగవల్లికి బ్యాడ్ నేమ్ వచ్చిందని, అందుకే ఎలిమినేట్ అయి ఉంటుందని కౌశల్ విశ్లేషించాడు.