Nandini Rai: బిగ్ బాస్2 షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన నందిని రాయ్.. మమ్మల్ని బ్యాడ్ చేసారంటూ!

Nandini Rai: బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఈ షో తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా ప్రసారమవుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా బిగ్ బాస్ షో ని సపోర్ట్ చేసేవారు ఎంతమంది ఉన్నారో, షోపై నెగటివ్ గా కామెంట్ చేసే వారు అంతే మంది ఉన్నారు. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా మాత్రం బిగ్ బాస్ షో ని మాత్రం ఆపడం లేదు. బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ తో పాటు వివాదాలు కూడా ఉంటాయి. కంటెస్టెంట్స్ ఒకరినొకరు విమర్శించుకోవడం, కొట్టుకోవడం బయట వాళ్ళ అభిమానులు వేరే కంటెస్టెంట్స్ ని ట్రోలింగ్స్ చేయడం జరుగుతూనే ఉంటాయి.

తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్ లు విజయవంతంగా పూర్తి అయిన విషయం తెలిసిందే. త్వరలోనే మరో సీజన్ కూడా ప్రారంభం కానుంది. కాగా తెలుగులో ప్రసారమైన అన్ని సీజన్లు ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ సీజన్ 2 మరొక ఎత్తు అని చెప్పాలి. కానీ అన్ని సీజన్స్ కంటే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 2 బాగా వివాదాస్పదం అయింది. షోలో గొడవలే కాకుండా బయట కౌశల్ ఆర్మీ అని అతని మనుషులు అందరి కంటెస్టెంట్స్ మీద, నాని మీద తీవ్రంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న నటి నందిని రాయ్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బిగ్ బాస్ గురించి మాట్లాడింది. ఈ సందర్బంగా నందిని రాయ్ మాట్లాడుతూ..

బిగ్ బాస్ కి అక్కడ హౌస్ లో సోలోగా ఉండవచ్చు అని వెళ్ళాను. అప్పుడు నేను డిప్రెషన్ ఫేజ్ లో ఉన్నాను. దాంతో కొత్తగా ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు అని వెళ్ళాను. బయటకు వచ్చాక మంచి ఫేమ్ వచ్చింది. కానీ టీవీ వాళ్ళు వాళ్లకు ఎవరు టీఆర్పీ తెస్తే వాళ్ళని మంచిగా చూపిస్తారు. కౌశల్ వాళ్లకు టీఆర్పీ తెచ్చాడు కాబట్టి అతన్ని మంచిగా చూపించి మమ్మల్ని బ్యాడ్ గా చూపించారు. లోపల చాలా జరుగుతాయి. కానీ అది ఎడిట్ చేసి ఛానల్ కొంతమంది గురించే గుడ్ చూపిస్తుంది. మిగిలిన వాళ్లను నెగిటివ్ గా చూపిస్తారు. ఛానల్ తన బిజినెస్ చూసుకుంటుంది. నాని గారిని కూడా ట్రోల్ చేసారు. బయటకు వచ్చి అన్ని ఎపిసోడ్స్ చూస్తే మేము మాట్లాడినవి మంచివి చాలా కట్ చేసారు. కానీ బిగ్ బాస్ వల్ల ఫేమ్ వచ్చి సినిమాలు, సిరీస్ లు ఆఫర్స్ వచ్చాయి అని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.