Kaushal: ఉదయ్ కిరణ్ చనిపోయి మంచి పని చేశారు.. బతకడం వేస్ట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కౌశల్!

Kaushal: ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉదయ్ కిరణ్. తక్కువ సమయంలోనే చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కదన్నా లాంటి ఎన్నో ప్రేమకథా చిత్రాలను చేసి లవర్ బాయ్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ క్షణంలో అందరూ హీరో ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్నేళ్లపాటు ఏలేస్తాడని అనుకున్నారు.

కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కు ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. అవకాశాలు రాకపోవడంతో మానసిక శోభకు గురైన ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ షాక్ కి గురైందని చెప్పాలి. ఇక ఆయన మరణం గురించి ఇప్పటికి అనేక రకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఉదయ్ కిరణ్ మరణ వార్త పట్ల స్పందించిన విషయం తెలిసిందే. అది అనేక రూమర్స్ కూడా వినిపించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సంచలన విషయాలను బయట పెట్టారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా కౌశల్ మాట్లాడుతూ.. ఉదయ్‌ హీరో కాకముందే నాకు తెలుసు. ఆయనతో కలిసి నేను పదమూడు సినిమాలకు పైగా పని చేశాను. బేగంపేట్‌ లో ఉండేవాడు. అప్పుడప్పుడు అతని ఇంటికి కూడా వెళ్లేవాడిని. ఇద్దరం కలిసి యాడ్‌ ఫిల్మ్స్‌కి పని చేశాము. చాలా కష్టపడి స్టార్‌ పొజిషిషన్‌కి వచ్చాడు. ఆటైంలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. చిన్న చిన్న సినిమాలు చేస్తున్న ఆయనకు చిత్రం మూవీతో మంచి బ్రేక్‌ వచ్చింది.అప్పటి వరకు ఆయన చాలా కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం చూస్తే.. ఆయన చనిపోయి మంచి పనే చేశాడని అనకూడదు.. కానీ.. ఇలాంటి సమాజంలో బతకడమే వేస్ట్‌. ఒక మనిషి జీవితంలో కష్టపడి పై స్థాయికి వెళితే కిందకు లాగడానికే ట్రై చేస్తారు. దాని వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ అదొక ఆనందం. పైకి వెళ్లిన వారిని హింసించి మెసేజ్‌లు పెట్టి, ట్రోల్‌ చేసి కిందకు లాగేద్దామనే ఆలోచనతోనే చాలా మంది ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశల్.