Karan Johar : టాలీవుడ్ ని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలన్న కరణ్…!

 

Karan Johar: తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన చరిత్ర ఉంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా తోనే మొదట దేశవ్యాప్తంగా అందరి చూపు తెలుగు చలన చిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేసింది. తర్వాత బాహుబలి సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేసింది. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమాతో ఆ ప్రభంజనం ఇంకా పెరిగింది. టాలీవుడ్ ఒక్కటే కాదు సౌత్ సినిమాలన్నీ కూడా ఇప్పుడు బాలీవుడ్ తో పోటీ పడుతున్నాయి.కేజీఎఫ్, సాహో, పుష్ప సినిమాలే ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

ఇక ఇప్పుడు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా దేశ వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది అని చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రత్యేక సెలబ్రిటీ కూడా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. పలువురు ఈ సినిమా ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అగ్రదర్శక నిర్మాత కరణ్‌ జోహార్ దక్షిణాది సినిమాలను ఆకాశానికెత్తేసాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసి బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ నేర్చుకోవాలని, రొటీన్‌ సినిమాలు కాకుండా కొత్త దారిని ఎంచుకోవాలని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌లో మూసధోరణి కొనసాగుతుంది. బయోపిక్స్‌ హిట్‌ అయితే అంతా ఆ తరహా సినిమాలను రూపొందిస్తాం.ఒకవేళ సందేశాత్మక సినిమాలు విజయం సాధిస్తే అవే కథల్ని ఎంచుకుంటాం.

నాతో సహా దర్శక నిర్మాతలంతా పక్కవాళ్లు ఏం చేస్తున్నారనే ఆలోచిస్తుంటాం. కానీ తెలుగులో అలా కాదు. తమ సొంత ఆలోచనలతో కథలు రూపొందిస్తున్నారు. అందుకే ఇటీవల వచ్చిన పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాలు బాలీవుడ్‌లో కూడా గొప్ప విజయాలు సాధిస్తున్నాయి అని పేర్కొన్నారు.