వెన్నెల కిషోర్ ఒక్క రోజుకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్నారు. ఇలాతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్రహ్మానందం ఆలీ వంటి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమెడియన్స్ ఉండగా నేటి తరానికి వస్తే అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో వెన్నెల కిషోర్ ఒకరు.వెన్నెల సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఆయనకు వెన్నెల కిషోర్ అనే పేరు వచ్చింది.ప్రస్తుతం ప్రతి ఒక్క యంగ్ హీరోల సినిమాలలో వెన్నెల కిషోర్ తప్పకుండా సందడి చేస్తుంటారు.

ఈ విధంగా వెన్నెల కిషోర్ వరుస సినిమాలలో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు.అయితే ఈయన ఒక్కరోజు కోసం తీసుకునే రెమ్యూనరేషన్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.ఒక్కరోజు కోసం వెన్నెల కిషోర్ సుమారు ఐదు నుంచి 6:30 లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్. అయితే ఇది కేవలం సినిమాలలో నటించడానికి మాత్రమే. ఈయన ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలలోనూ పాల్గొనరు. ఒకవేళ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనాల్సి వస్తే అదనంగా రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్.

వెన్నెల కిషోర్ తీసుకునే రెమ్యూనరేషన్ కి ఒకటి రెండు రోజులు ఉచితంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటారు. అంతకుమించి ఈయన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనాలంటే రోజుకు 5 లక్షల వరకు చెల్లించాల్సిందేనని ఇండస్ట్రీ టాక్. రెమ్యూనరేషన్ విషయంలో వెన్నెల కిషోర్ చాలా కమర్షియల్ గా ఉంటారని తెలుస్తుంది. ఏది ఏమైనా వెన్నెల కిషోర్ ఒక రోజుకు ఐదు లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.