అందరిముందూ నాకు ఏడవాలని లేదు … జాన్వీ కపూర్!

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన మొదటి సినిమాతోనే తన అందం,నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇలా హీరోయిన్ గా జాన్వీ నటించిన మొదటి సినిమాలో ఆమె నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జాన్వి కపూర్ నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వటంతో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం “మిలీ” సినిమా ద్వారా ముందుకి రానుంది .

సూపర్ హిట్ మలయాళీ మూవీ ‘హెలెన్‌’ ని హిందీలో మిలీగా రీమేక్ చేశారు. మత్తుకుట్టి జేవియర్‌ దర్శకత్వంలో.. బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై బోనీ కపూర్ ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేసాడు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ , కన్నడ భాషలలో నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో జాన్వీ కపూర్ పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ మీడియా సమావేశంలో … శ్రీదేవీ బయోపిక్ లో నటిస్తారా? అని ఒక విలేకరి అడగ్గా… జాన్వీ కపూర్ స్పందిస్తూ… నటించనని సమధానం చెప్పింది. ఆ తర్వాత కారణం చెప్పాలని విలేకరి కోరగా.. సమాధానం చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వేదికపై నేను ఏడవాలి అనుకోవడం లేదని జాన్వీ కపూర్ సమధానం తెలిపింది. ఇక శ్రీదేవీ బయోపిక్ చేయనని జాన్వీ కపూర్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత “మిస్టర్ అండ్ మిసెస్ మహి” సినిమా షూటింగ్ లో జాన్వీ కపూర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ జాన్వీ కపూర్ చాలా బిజీగా ఉంది. ఇక తెలుగులో కూడా సినిమా చేయాలని అషపడుతున్నట్లు ఇటీవల వెల్లడించింది.