‘పుష్ప-2’ కోసం భారీగా ఖర్చు!

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఏదైనా ఉందా? అంటే అది’పుష్ప-2′ అనే చెప్పాలి. లెక్కల మాస్టార్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో 2022 డిసెంబర్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తగ్గేదేలే.. అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు తెగ నచ్చేసింది.

ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక సాలిడ్‌ న్యూస్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతుంది.

ఈ మూవీలో ఇంటర్వెల్‌ సీన్‌ గంగమ్మ జాతర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటర్వెల్‌ సీన్‌ కోసమే మేకర్స్‌ రూ.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు టాక్‌ వినిపిస్తోంది. గంగమ్మ జాతర సీక్వెన్స్‌ దాదాపు 25 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో మూవీ ఎంత గ్రాండ్‌గా ఉంటుందోనని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చిత్తూరు, తిరుపతిలోని ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండగా.. తిరుపతిలోని స్థానిక గంగమ్మ జాతరలోని సంప్రదాయాన్ని సుక్కు ఈ సినిమాలో చూపించనున్నాడు.