Hyper Aadi: హైపర్ ఆది ఇటీవల జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కెసిఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సినిమా ఈ నెల 22వ తేదీ విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా వేడుకకు రోజా హరీష్ రావు అలాగే హైపర్ ఆది ఇతర జబర్దస్త్ కమెడియన్స్ కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం గురించి నెగిటివ్ కామెంట్లు చేసే వారికి తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.
చాలామంది జబర్దస్త్ కార్యక్రమాన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు జబర్దస్త్ కార్యక్రమాన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో ట్రోల్ చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దని ఈయన తెలిపారు. జబర్దస్త్ కార్యక్రమం కొన్ని వందల కుటుంబాలకు జీవితాలను ఇచ్చిందని తెలిపారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది హీరోలుగా దర్శకులుగా ఆర్టిస్టులుగా స్థిరపడి తమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. మరో వంద మంది టెక్నీషియన్లకు జబర్దస్త్ కార్యక్రమం లైఫ్ ఇచ్చింది.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ వేదికపై ఉన్న వారందరూ కూడా అంత ఈజీగా ఈ స్థాయికి రాలేదని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని తినే ప్లేటును పక్కకు లాగడం వాచ్ మెన్ చేత బయటకు గెంటేయించుకోవడం వంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న తర్వాతే ఇక్కడికి వచ్చారు. ఎవరు కూడా అలాంటి నెగిటివ్ కామెంట్లు చేయొద్దు.జబర్దస్త్ ని కొంతమంది కూర్చొని డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తారు అని తిడతారు. మరి మీరెవరూ చూడకుండానే యానిమల్ సినిమాకు 700 కోట్లు వచ్చాయా? చేసేవి గుడి వెనక పనులు చెప్పేవి ఏమో వివేకానంద సూక్తులు. జబర్దస్త్ మీద పడి ఏడ్చేవాళ్లకు ఒకటే చెబుతున్నా. ఇంత చెప్పినా మీరు అలాగే నెగిటివ్ కామెంట్లు చేస్తే నా గడ్డం నుంచి రెండు వెంట్రుకలు ఊడిపోయాయని అనుకుంటాను అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనగా మారాయి. ఎవరైతే నవ్వించడం ఈజీ అనుకుంటారో అలాంటివారు మల్లెమాల ఆఫీసుకు రండి నేను ఆడిషన్స్ చేయించి మీకు చాన్స్ ఇప్పిస్తాను అంటూ ఆది ఈ సందర్భంగా మండిపడ్డారు.