Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం గురించి మాట్లాడుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు తాము ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీలన్నింటిని కూడా తెలంగాణలో నెరవేర్చమని రేవంత్ రెడ్డి చెప్పడంతో ఈయన ఈయన పట్ల విమర్శలు వచ్చాయి.
బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రచార కార్యక్రమాలలో మాత్రం అన్ని హామీలను నెరవేర్చినట్టు గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అంటూ ఈయన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే మహారాష్ట్రలోనే రేవంత్ రెడ్డి ఈ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలను ఏడాదిలోపే అమలు పరిచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాలపై మీకు నమ్మకం లేకపోతే హెలికాప్టర్లలో వచ్చి చూడండి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక తాను ఆరు గ్యారెంటీలను అమలు పరచడాన్ని నమ్మలేకపోతున్న మోడీ గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని తెలంగాణకు పంపించాలని కోరారు.
ఇక ఆ కమిటీని పంపించడానికి మీ వద్ద డబ్బులు లేకపోతే చెప్పండి నేనే హెలికాప్టర్లను పంపిస్తాను అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు అలాగే ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ అలాగే వరి ధాన్యం కొనుగోలు క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా అందజేశామని తెలిపారు. ఇలా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేశాం.. నమ్మకపోతే మోడీ ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణకు పంపండి
కమిటీ రావడానికి డబ్బులు లేకపోతే చెప్పండి నేను హెలికాప్టర్ పంపిస్తా – రేవంత్ రెడ్డి pic.twitter.com/S9ruH6NJGi
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2024