Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అయ్యప్ప మాల ధరించారు ఇలా అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి ఈయన ఎంతో నియమనిష్టలతో ఈ దీక్షను పూర్తి చేస్తారు. ఇలా ప్రతి ఏడాది రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష వేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా అయ్యప్ప దీక్ష వేసుకున్నటువంటి చరణ్ తాజాగా కడపకు వచ్చారు. ఇలా కడప వచ్చిన ఈయన ముందు శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ విధంగా రామ్ చరణ్ ఆలయానికి రావడంతో ఆలయ అర్చకులు ఈయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇలా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత రామ్ చరణ్ కడపలో ఎంతో ఫేమస్ అయిన అమీన్ పీర్ దర్గాని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ దర్గాలో ఉరుసు ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఈ దర్గాని దర్శించుకున్నారు అనంతరం ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ దర్గాని దర్శించుకున్నానని వెల్లడించారు.
ఇకపోతే మూడు నెలల క్రితం ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన దగ్గర ఈ దర్గా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలిపారు. ఒకసారి దర్గా గురించి చెబుతూ దర్శించుకొమ్మని ఆయన చెప్పడంతోనే తాను ఈరోజు ఇక్కడ వచ్చి దర్గాని దర్శించుకున్నానని చరణ్ తెలిపారు. ఇలా ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది.
అయ్యప్ప మాల వేసుకుని దర్గా అంటూ ఓ సమాధి వద్దకు వెళ్లడం ఎంతవరకు సమంజసం అది కూడా ఏఆర్ రెహమాన్ చెబితే వచ్చానని ఎలా చెబుతారు. ఇప్పుడు మీరు కూడా రెహమాన్ దగ్గరకు వెళ్లి తిరుపతి వెళ్ళమని చెప్పండి ఆయన వెళ్తారా అంటూ నేటిజన్స్ భారీ స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఇలా మాలలో ఉన్నటువంటి వారు దర్గా వెళ్లొచ్చా అనే ప్రశ్న కూడా అందరిలోనూ కలుగుతుంది. కొందరు ఏం తప్పులేదు అంటూ వారి అభిప్రాయాలు తెలుపుగా మరికొందరు మాత్రం ఇలా అయ్యప్ప మాలలో ఉండేవారు చాలా నియమనిష్టలతో ఉంటారు. అలాంటిది దర్గా అంటే ఒక సమాధి అని అర్థం అక్కడికి వెళ్లడం సరైనది కాదు అంటూ రాంచరణ్ వ్యవహార శైలి పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.