AP Politics: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదని చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు ఈయన దారుణంగా హత్యకు అయితే ఈ హత్య వైయస్ జగన్ సమక్షంలోనే జరిగింది అంటూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆరోపణలు చేశారు. ఇక ఈ ఆరోపణలు గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా ఎంతో బలమైన కారణంగా నిలిచాయి.
వయసు అవినాష్ తన తండ్రిని దారుణంగా చంపారని అందుకు జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించారు అంటూ సునీత బహిరంగ కామెంట్లు చేయడమే కాకుండా ఈ ఎన్నికలలో తన అన్నయ్యకు ఓటు వేసి గెలిపించద్దు అంటూ కూడా ఈమె ప్రచార కార్యక్రమాలలో తెలియజేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీత రెడ్డి చంద్రబాబు నాయుడు అలాగే హోం మంత్రి అనితను కలిసిన సంగతి తెలిసిందే.
తాజాగా వివేకా హత్య కేసులో కీలక మలుపు సంతరించుకుంది వివేకానంద పీఏ కృష్ణారెడ్డి.. 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదులు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా సోమవారం పోలీసు విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు పులివెందుల డిఎస్పీ మురళి నాయక్ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి మరి ఆయనని విచారించారు.
న్యాయవాదుల సమక్షంలో ఆయన వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు..మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇటీవలే వైఎస్ సునీత సీఎం చంద్రబాబు, హోం మంత్రి తో పాటు రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీని కూడా ఈమె కలిసారు. ఇక ఈ కేసులో పూర్వపరాలు తెలుసుకోవడం కోసం కృష్ణారెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలుస్తోంది.
ఈ విధంగా సునీత మరోసారి తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలి అంటూ ఈ కేసు పై దర్యాప్తును ముమ్మరం చేయడానికి అధికారులను సంప్రదించారు మరి కూటమి ప్రభుత్వంలో ఈ కేసు పై విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారా అదే జరిగితే జగన్ అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పవా? అసలు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలని బయట పెట్టనున్నారా అనేది తెలియాల్సి ఉంది.