గేమ్ చేంజర్ వెనుకబడినట్లేనా.. భారం మొత్తం రామ్ చరణ్ పైనే!

ప్రస్తుతం ఇండస్ట్రీలో పుష్ప మేనియా నడుస్తోంది. ఎవరి నోట విన్నా ఆ సినిమా గురించిన విశేషాలే, ఆ సినిమా ట్రైలర్ లాంచ్ సక్సెస్ గురించిన కబుర్లే. నిజానికి తెలుగువారు తక్కువగా ఉన్న పాట్నాలోcట్రైలర్ లాంచ్ జరిగింది అయినప్పటికీ ట్రైలర్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. నిజానికి ఒక తెలుగు సినిమాకి నార్త్ లో ఇంత పెద్ద సక్సెస్ అందుకోవటం అంటే మాటలు కాదు.

అయితే ఈ సినిమా కంటే ముందే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ గేమ్ చేజర్ ట్రైలర్ లాంచ్ కూడా నార్త్ లోనే జరిగింది అయితే పుష్ప 2 కి వచ్చినంత హైప్ గేమ్ చేంజర్ ఈవెంట్ కి రాలేదనే చెప్పాలి. అయితే గేమ్ చేంజర్ విషయంలో జరిగిన పొరపాటు ఏమిటంటే ఆ ఈవెంట్ ని పరిమిత సీటింగ్ ఉన్న ఇండోర్ థియేటర్లో చేశారు. నిజానికి నిర్మాత దిల్ రాజు ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తప్పటడుగు వెయ్యడు కానీ ఈ ఈవెంట్ ఇండోర్ లో ప్లాన్ చేసి పెద్ద తప్పు చేశాడు.

ఎందుకంటే పరిమిత సీటింగు, ఇండోర్ థియేటర్ కావడంతో అనుకున్నంత రీచ్ సాధించలేకపోయింది ఆ ఈవెంట్. దాంతో ఇప్పుడు అందరూ పుష్ప టు ఈవెంట్ తో గేమ్ చేంజ్ ని కంపేర్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు నెలరోజులు తేడాతో విడుదలకు సిద్ధంగా ఉండటంతో గేమ్ చేజర్ మీద ఒత్తిడి పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైన పుష్ప సినిమా గురించి ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చేసింది.

అలాగే బెనిఫిట్ షో టికెట్లు ఎలా అమ్మాలని దానిపై వెరైటీ స్టేటజీలు ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. కానీ గేమ్ చేంజ్ విషయంలో అలా కాదు,ఎందుకంటే డైరెక్టర్ శంకర్ మీద ఇండియన్ టు ప్రభావం పడటం, అలాగే సినిమా విడుదల విపరీతమైన జాప్యానికి గురికావడంతో ఆ సినిమాకి హైప్ తగ్గిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా జనవరి 10న విడుదలకు సిద్ధంగా ఉంది ఇక రాంచరణ్ మార్కెట్ మీదే ఈ సినిమా ఆధారపడి ఉంది అనేది నిజం.