నమ్మి మోసపోయానంటున్న నయన్.. తన డాక్యుమెంటరీ పై లేడీ సూపర్ స్టార్ కామెంట్స్!

నయనతార వ్యక్తిగత జీవితానికి ఆమె కెరియర్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలియజేస్తూ నయనతార: బి యాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో తన కెరియర్ ఎలా మొదలైంది తన సినిమాలు, తన ప్రేమ, పెళ్లి కుటుంబం ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడింది. సినిమాలు పెద్దగా చూడని నయన్ కు మలయాళం ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎలా అవకాశాలు వచ్చాయి వంటి వాటి విషయాల గురించి వివరించారు.

ఈ డాక్యుమెంటరీలో నయనతార తో పనిచేసిన చాలామంది హీరోలు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు కూడా ఆమె గురించి మాట్లాడటం విశేషం. అయితే తన డాక్యుమెంటరీ పై నయనతార స్పందిస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చింది. రిలేషన్షిప్ అనేది నమ్మకం మీద కొనసాగుతుంది నేను అతన్ని నమ్మాను, అవతలి వ్యక్తి కూడా నన్ను ప్రేమిస్తారు అని అనుకున్నాను కానీ అలా జరగలేదు. నా ఫస్ట్ రిలేషన్షిప్ గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు కానీ జనాలు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, నన్ను ప్రశ్నించారు.

మగవాళ్ళని ఎవరూ ఇలా ప్రశ్నించారు కానీ ఆడవాళ్ళని మాత్రం ప్రశ్నిస్తారు అంటూ బాగా ఎమోషనల్ అయింది నయనతార. అయితే తను గతంలో ఎవరితో రిలేషన్ షిప్ లో ఉందో ప్రస్తావించలేదు నయనతార.అయితే ఇదంతా తాను ప్రేమాయణం సాగించిన శింబు, ప్రభుదేవా ల గురించి అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తన భర్త అయిన విగ్నేష్ శివన్ తో నేను రౌడీనే సమయంలో ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి 2022లో మూడుముళ్ల బంధంతో ఒకటైంది ఈ జంట.

తమ రిలేషన్షిప్ గురించి తెలిసిన తర్వాత వచ్చిన మీమ్స్ గురించి ఆ సమయంలో జరిగిన ట్రోలింగ్ పైన విగ్నేష్ స్పందించారు. ఏడడుగుల బంధంతో అడుగుపెట్టడం గురించి చెప్తూ నయనతార, విగ్నేశ శివన్ వివాహానికి సంబంధించిన వీడియోలను అందంగా చూపించారు. ఇక చివర్లో వీరి పిల్లల ఉలగం, ఉయిరేలను చూపిస్తూ డాక్యుమెంటరీ అని ముగించారు.