Allu Arha: పదో తరగతి పద్యం అలవోకగా చెప్పిన అర్హ… బాలకృష్ణ షాకింగ్ రియాక్షన్ !

Allu Arha: బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరైన విషయం మనకు తెలిసిందే .ఇక ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం కాబోతుంది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ప్రసారం కాగా రెండో ఎపిసోడ్ ఈనెల 22వ తేదీ ప్రసారం కాబోతోంది. ఈ విధంగా అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇక మొదటి భాగంలో అల్లు అర్జున్ తల్లి నిర్మల గారు ఈ కార్యక్రమంలో సందడి చేయగా రెండో భాగంలో అల్లు అర్జున్ పిల్లలు అయాన్ అర్హ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అల్లు అర్హ అయాన్ ను బాలకృష్ణ ఇన్వైట్ చేయడంతో పిల్లలు ఇద్దరు వేదిక పైకి రావడంతోనే బాలయ్య కాళ్లకు నమస్కారం చేశారు. అనంతరం బాలకృష్ణ అర్హతతో మాట్లాడుతూ ఏ క్లాస్ చదువుతున్నావ్ అని ప్రశ్నించారు. అర్హ సెకండ్ క్లాస్ చదువుతున్నానని చెప్పగా బాలకృష్ణ నేను ఇంకా ఫస్ట్ క్లాస్ అని చెప్పడంతో అర్హ షాక్ అవుతుంది. ఇకపోతే అర్హను బాలయ్య ప్రశ్నిస్తూ.. నీకు తెలుగు వచ్చా అని అడిగారు. ఈ మాటకు అర్హ ఏకంగా పదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ప్రవరుని స్వగతం కథాంశానికి సంబంధించిన అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ అనే పద్యాన్ని ఏమాత్రం తప్పు లేకుండా ఎక్కడ తడబడకుండా చెప్పేశారు.

ఈ పద్యం 90 కిడ్స్ అందరికీ చాలా బాగా తెలుసు అయితే ప్రస్తుతం ఇలాంటి పద్యాలు తెలుగు పాఠ్య పుస్తకాలలో రావడం కూడా చాలా అరదు. అయితే అర్హ మాత్రం ఈ పద్యం చాలా సులభంగా చెప్పడంతో బాలయ్య ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా అర్హను దగ్గరకు తీసుకొని ఆమెకు ముద్దులు పెడుతూ నిన్న చూస్తుంటే తెలుగు పదికాలాలపాటు ఇంకా బ్రతుకుతుందని నమ్మకం కలిగింది అంటూ అర్హ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక అయాన్ ను ప్రశ్నిస్తూ నీ కంటే నాన్న చెల్లిని బాగా చూసుకుంటారట కదా అని అడగగా లేదు తనని బాగా చూసుకుంటారని చెప్పారు. ఇక అల్లు అర్జున్ కలగజేసుకొని వీడు యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ లాంటివాడు. తండ్రి కోసం ఏమైనా చేస్తాడు కానీ తల్లిని ఏమైనా అంటే అసలు ఒప్పుకోడనీ చెప్పగా నిన్ను చూస్తుంటే ఐకాన్ స్టార్ కే అమ్మ మొగుడిలా ఉన్నావు అంటూ బాలయ్య అనడంతో అయాన్ మాత్రం తగ్గేదే అంటూ తన తండ్రి మేనరిజాన్ని ప్రదర్శించడంతో అందరూ నవ్వుకున్నారు.