Pushpa 2: సాధారణంగా ఒక సినిమా నుంచి ఒక ట్రైలర్ లేదా టీజర్ విడుదల చేయాలి అంటే ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసి యూట్యూబ్ ద్వారా ఆ ట్రైలర్ ని విడుదల చేస్తూ ఉంటారు కొంతమంది సినిమా వేడుక చేయాలి అనుకుంటే ఏదైనా థియేటర్లో ఇలా ట్రైలర్ లేదా టీజర్ విడుదల చేస్తూ ఉంటారు కానీ ఇటీవల పుష్ప 2సినిమా ట్రైలర్ లాంచ్ మాత్రం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
పుష్ప2 సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ఈ ట్రైలర్ ఏకంగా పాట్నాలో లాంచ్ చేశారు వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అల్లు అర్జున్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈయన ఇలాంటి ఈవెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటే ముంబైలో చేయవచ్చు లేదా సౌత్ రాష్ట్రాలలో ఎక్కడైనా కూడా ప్లాన్ చేయవచ్చు కానీ బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఎందుకు ప్లాన్ చేశారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఇలా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో నిర్వహించడానికి కూడా కారణం లేకపోలేదని తెలుస్తోంది. పుష్ప మాస్ సినిమా, కూలి పని చేసుకునే ఒక సాధారణ యువకుడు ఒక ప్రపంచాన్ని ఏలే ఒక నాయకుడుగా ఎలా ఎదిగాడు అన్నదే ఈ కథ. ఈ సినిమాలో అల్లు అర్జున్ వేషధారణ చూస్తే రోజు వారి కూలీ చేసే వ్యక్తి లాగా అనిపిస్తారు. దీంతో ఎంతోమంది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు.
బీహార్లో, ఉత్తరప్రదేశ్, బెంగాల్ లో ఎక్కువ శాతం శ్రామిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. వారందరూ పుష్పని తమ కథగా భావించారు. వాళ్లలో వాళ్లే పుష్పరాజ్ ని చూసుకున్నారు. ఇలా భావించడం బట్టి నార్త్ ఇండస్ట్రీలో గతంలో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా పుష్ప సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమా ఓటీటీలలో వచ్చిన తర్వాత ఈ సినిమాకు అల్లు అర్జున్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పాలి. ఇలా ఈ ఒక్క కారణంతోనే పాట్నాలో ఈ సినిమా వేడుకను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.