RGV: రాంగోపాల్ వర్మ పై ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీస్ కేసు నమోదు అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన గతంలో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలను పూర్తిగా మార్నింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి నేత మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు స్వయంగా వర్మ ఇంటికి వెళ్లి మరి ఆయనకు నోటీసులు అందజేయడమే కాకుండా ఈ నెల 19వ తేదీ విచారణకు రావాలని తెలియజేశారు.
ఇక నేడు నవంబర్ 19వ తేదీ రామ్ గోపాల్ వర్మ విచారణకు గైహాజరయ్యారు. ఇలా ఈయన విచారణకు హాజరు కాలేకపోతున్నానని వాట్సప్ ద్వారా పోలీసులకు సమాచారాన్ని అందచేయడమే కాకుండా తనకు మరింత సమయం కావాలని కూడా పోలీసులను కోరారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ పోలీసులకు మెసేజ్ చేస్తూ తాను సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు.
ఈ కేసు విషయంలో తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని అయితే విచారణకు హాజరు కావడానికి నాకు మరికాస్త సమయం కావాలని ఈయన పోలీసులను కోరారు. అయితే రామ్ గోపాల్ వర్మ నిజంగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారా లేకపోతే విచారణకు రాలేక ఇలా చెప్పారా అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.. ఇక నేడు పోలీసుల ముందు కేస్ విచారణకు హాజరు కావాల్సిన రాంగోపాల్ వర్మ ఇదివరకు ఏపీ హైకోర్టులో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ విధంగా రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్ట్ షాకింగ్ తీర్పు వెల్లడించింది. ఈ పిటిషన్ కోర్టు కొట్టేయడమే కాకుండా అరెస్ట్ భయం ఉంటే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఇక తనకు విచారణకు మరికాస్త గడువు కావాలని కూడా వర్మ కోరడంతో ఈ విషయం స్వయంగా పోలీసులని అడగాలని కోర్టు తెలియజేసింది. దీంతో ఈయన వాట్సాప్ ద్వారా పోలీసులకు మెసేజ్ చేశారు.