Jr NTR: అందుకే అమ్మ బయటకు రావటానికి ఇష్టపడదు : జూ.ఎన్టీఆర్‌

Jr NTR: ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రంతో హీరోగా అరంగ్రేటం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆది, సింహాద్రి సినిమాతో తిరుగులేని మాస్‌ హీరోగా ఎదిగాడు ఇక ఆ తరువాత జూనియర్‌ ఎన్టీఆర్‌ నట ప్రస్థానం గురించి అంతా తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నందమూరి హీరో ఇటీవల ‘దేవర’ (Devara Movie) చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ దేవర (Devara Movie), వరగా ద్విపాత్రాభినయంలో తన నటనతో మెప్పించాడు. నటుడిగా, డ్యాన్సర్‌గా ఎన్టీఆర్‌కు (Jr NTR) మంచి పేరుంది. ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్‌ వన్‌ ఆఫ్‌ బెస్ట్‌ ఫర్‌ఫార్మర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రోజు తాను నటనలో, డ్యాన్సుల్లో ఓ ప్రత్యేకత సంపాందించుకోవడానికి కారణం తన అమ్మే అంటున్నాడు ఎన్టీఆర్‌.

Devara Movie Review: ‘దేవర’ మూవీ ఎలా ఉందటే…

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ”నీ కంటూ ఏదైనా స్పెషాలిటీ ఉన్నప్పుడే, నీదంటూ ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకుంటేనే నలుగురిలో గుర్తింపు వస్తుందని చెబుతుండేది. ఆమె మాటల ఇన్‌స్పిరేషన్‌తోనే కూచిపూడి నేర్చుకున్నాను. అమ్మ నుంచే అందరితో మాట్లాడటం తెలుసుకున్నా. చాలా మంది అమ్మలు తమ పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించడానికి రకరకాల కారణాలతో ఒప్పుకోరు. మా అమ్మ మాత్రం ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లమనేది.

ఏ విషయమైనా సొంతంగా తెలుసుకోమనేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెప్పుడూ నా దగ్గర తన కష్టాల్ని దాచిపెట్టలేదు. కష్టాల నడుమనే ఎదగడం గొప్పదనం అని చెబుతుండేది. కష్టపడ్డ వారే ప్రతిఫలం అనుభవించాలి అంటుండేది. అందుకే నాకు హీరోగా ఎంతటి పేరొచ్చినా అమ్మ అసలు బయటికి రాదు. కష్టం నీదే కాబట్టి ప్రతిఫలం కూడా నీదే అనేది’ అని అమ్మ గురించి విశేషాలను చెప్పుకొచ్చారు ఎన్టీఆర్‌(Jr NTR).

ప్యాలేస్ బాత్రూం | Atchnnaidu Vs Bosta Satyanarayana || Pawan Kalyan Laughing Over Atchannaidu || TR