ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్
పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కొండ పొలం చిత్రాలకు పలు అవార్డులు
ఉత్తమ గీతరచయితగా చంద్రబోస్
ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
కొమురం భీముడో గాయకుడుగా కాలభైరవ
జాతీయ చలనచిత్ర అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. వీటిని దేశవ్యాప్తంగా ఉత్తమ సినిమాలను వాటిలో నటించిన కళాకారుల ప్రతిభను గౌరవించేందుకు, సాంకేతిక నిపుణుల ప్రజ్ఞకు గుర్తింపు నిచ్చేందుకు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రకారం జాతీయ చలనచిత్ర అవార్డులు సౌందర్యం సాంకేతిక నైపుణ్యం .. సామాజిక ఔచిత్యం కలిగిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలను గురువారం (ఆగస్ట్ 24) సాయంత్రం ప్రకటించారు.
ఈ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగుసినిమాలు సత్తా చాటాయి. పలు విభాగాల్లో అవార్డులు గెల్చుకున్నాయి. అన్నింటికీ మించి జాతీయ ఉత్తమ నటుడిగా ‘పుష్ప: ది రైజ్’ హీరో అల్లు అర్జున్ అవార్డు దక్కించుకున్నారు. అవార్డుల్లో పుష్ప,కొండపలం, ఆర్‌ఆర్‌ఆర్ సత్తా చాటాయి. ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా.. గంగూబాయి కతియావాడి, మిమీ చిత్రాలకు గాను అలియా భట్ కృతి సనన్ సంయుక్తంగా ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ఉత్తమ చలనచిత్రంగా అవార్డును గెలుచుకుంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పూర్తి జాబితా ఈ సంవత్సరం జై భీమ్, మిన్నల్ మురళి, తలైవి, సర్దార్ ఉదం, 83, పుష్ప ది రైజ్, షేర్షా, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, గంగూబాయి కతియావాడి , నాయట్టు, రాకెట్రీ వంటి అనేక చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. గత అవార్డుల్లో సూర్య` అపర్ణ బాలమురళి..68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తమిళ చిత్రం సూరరై పొట్రు (ఆకాశం నీ హద్దురా) ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది `ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ , ఉత్తమ నటుడు` సూర్య, ఉత్తమ నటి అపర్ణా బాలమురళి, ఉత్తమ సంగీత దర్శకత్వం (స్కోర్) ఉªప ప్రకాష్ కుమార్, ఉత్తమ స్క్రీన్ ప్లేకి సుధా కొంగర అవార్డులు అందుకున్నారు. స్క్రీన్ ప్లే తో పాటు ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం కూడా వహించారు. సూర్య తన ఉత్తమ నటుడి విజయాన్ని తానాజీ నటుడు అజయ్ దేవగన్‌తో షేర్ చేసుకున్నాడు. ఆశా పరేఖ్‌ను 2022లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు.
‘త్రిబుల్ ఆర్’కు అవార్డుల పంట.. పలు విభాగాల్లో అవార్డులకు ఎంపిక
భారతీయ సినిమా రంగంలో టాలీవుడ్‌కి జాతీయ అవార్డుల రూపంలో జేజేలు పలకడం ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప సహా పలు అవార్డులు సొంతం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు సినిమా సాధించిన ఘనత దేశానికి మరింత వన్నె తెస్తోంది. ప్రపంచ సినీ యవనికపై నేడు భారతీయ సినిమా గొప్పగా వెలుగుతోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో ఆస్కార్ ని గెలుచుకున్న ఆనందం ఇంకా తెలుగు వారిలో అలానే ఉంది. ఇంతలోనే ఈ భారీ చిత్రానికి 6 విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం సంచలనంగా మారింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పూర్తి జాబితా ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఎంఎంకీరవాణి, ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ, ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ నాటు నాటు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్ అవార్డులు దక్కించుకున్నారు.
ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలోఫైట్ మాస్టర్ కి పురస్కారం దక్కింది. ఇక సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్ అవార్డును గెలుచుకుంది. నిజానికి 2023 ఆర్‌ఆర్‌ఆర్ నామ సంవత్సరంగా డిక్లేర్ అయింది. గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలు సహా హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలు దక్కాయి. వీటన్నిటినీ మించి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటునాటు’ పాటకు ఆర్.ఆర్.ఆర్ కి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ పురస్కారం దక్కింది. ఆస్కార్ లలో గుర్తింపుతో పాటు ఇప్పుడు జాతీయ అవార్డుల్లోను ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు కొరియోగ్రఫీకి మ్యూజిక్ కి గాయకుడికి అరుదైన గైరవం దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్.. ఈ సినిమా ఏ రేంజ్‌లో మోత మోగించిందో అందరికీ తెలుసు. బాక్సాఫీస్ దగ్గర నుంచి ఆస్కార్స్ దాకా.. ఎన్నో ఘనతల్ని తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఏ ఇండియన్ సినిమా సాధించని ఎన్నో రికార్డుల్ని తన పేరిట లిఖించుకుంది.
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ దీని హవా కొనసాగుతూనే ఉంది. జపాన్ బాక్సాఫీన్‌ని ఇంకా చీల్చిచెండాడుతూనే ఉంది. ఇప్పుడు జాతీయ అవార్డుల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్ తన సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు విభాగాల్లో పురస్కారాల్ని సొంతం చేసుకుంది. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా 2021 మార్చి 25వ తేదీన విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక ఈ చిత్రానికి గ్లోబల్‌వైడ్‌గా ప్రజాదరణ దక్కింది. ఫలితంగా.. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ’నాటు నాటు’ పాట బాగా వైరల్ అవ్వడంతో, అది ఆస్కార్స్ వేదిక దాకా చేరింది. ఎట్టకేలకు కోట్లాదిమంది భారతీయుల కలని సాకారం చేస్తూ.. నాటు నాటు ఆస్కార్ అవార్డ్‌ని కైవసం చేసుకుంది. ఇప్పుడు జాతీయ అవార్డుల్లోనూ ఆరు కేటగిరీల్లో అవార్డుల పంట పండటంతో.. చిత్రబృందం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
జాతీయ చలనచిత్ర అవార్డులు విజేతలు!
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం న్యూఢీల్లిలో ప్రకటించారు. క్యాలెండర్ ఇయర్ 2021లో అన్ని భాషల్లో నిర్మించిన ఉత్తమ భారతీయ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. 1 జనవరి 2021 ` 30 డిసెంబర్ 2021 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడిన ఫీచర్ , నాన్‌ఫీచర్ కేటగిరీ సినిమాలు ఈ అవార్డులకు అర్హమైనవి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పూర్తి విజేతల జాబితాలో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఉత్తమ నటీమణులుగా ఆలియా`కృతి సనన్‌లు అవార్డులు గెలుచుకున్నారు. ఆర్.మాధవన్ దర్శకత్వం వహించి నటించిన రాకేట్రి చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: రాకెట్రీ ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్, గోదావరి సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్. నేషనల్ ఇంటిగ్రేషన్: ది కాశ్మీర్ ఫైల్స్ కి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నర్గీస్ దత్ అవార్డు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్, పుష్ప ఉత్తమ నటి: అలియా భట్, గంగూబాయి కతియావాడి మరియు కృతి సనన్, మిమీ ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి, మిమీ ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి, ది కాశ్మీర్ ఫైల్స్.ఆస్కార్ గెలిచిన ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో 6 జాతీయ అవార్డులు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రాబారి, ఛెలో షో ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు: మెప్పడియాన్, విష్ణు మోహన్ సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం: అనునాద్`ది రెసొనెన్స్ పర్యావరణ పరిరక్షణ/పరిరక్షణపై ఉత్తమ చిత్రం: ఆవాసవ్యూహం ఉత్తమ బాలల చిత్రం: గాంధీ అండ్ కో ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): షాహి కబీర్, నయట్టు ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్): సంజయ్ లీలా భన్సాలీ / ఉత్కర్షిణి వశిష్ఠ, గంగూబాయి కతియావాడి ఉత్తమ సంభాషణ రచయిత: ఉత్కర్షిణి వశిష్ఠ / ప్రకాష్ కపాడియా, గంగూబాయి కతియావాడి ంబెనీ ఖీ।జీట ` రాధిక ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): దేవి శ్రీ ప్రసాద్, పుష్ప ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): కీరవాణి, ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ, ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్, ఇరవిన్ నిజల్, బెస్ట్ లిరిక్స్: చంద్రబోస్, కొండ పొలం దమ్ ఢాం ఢాం ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ / సోను కె పి, చవిట్టు ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్): అనీష్ బసు, జిల్లీ ఉత్తమ ఆడియోగ్రఫీ : సినోయ్ జోసెఫ్, సర్దార్ ఉదమ్ షేర్షా, విష్ణువర్ధన్ ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉదమ్ ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ ఉత్తమ మలయాళ చిత్రం: హోమ్ ఉత్తమ గుజరాతీ చిత్రం: ఛెలో షో ఉత్తమ తమిళ చిత్రం: కడైసి వివాహాయి ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన ఉత్తమ మరాఠీ చిత్రం: ఏక్దా కాయ్ జలా ఉత్తమ బెంగాలీ చిత్రం: కల్‌కోఖో ఉత్తమ అస్సావిూ చిత్రం: అనూర్ ఉత్తమ మెయిటీలోన్ చిత్రం ` ఐఖోయిగి యమ్ ఉత్తమ ఒడియా చిత్రం ` ప్రతీక్ష ఉత్తమ నాన్`ఫీచర్ ఫిల్మ్ ` ఏక్ థా గావ్ (గర్హ్వాలి / హిందీ) ఉత్తమ దర్శకుడు ` స్మైల్ ప్లీజ్ (హిందీ) చిత్రానికి బకువల్ మతియాని కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం ` చాంద్ సాన్సే (హిందీ) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ ` బిట్టు రావత్ (పాతాల్ టీ (భోటియా) ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం ? లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్) ఉత్తమ విద్యా చిత్రం ` సిర్పిగలిన్ సిపంగల్ (తమిళం) సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం ` మిథు ది (ఇంగ్లీష్), త్రీ టూ వన్ (మరాఠీ / హిందీ) ఉత్తమ పర్యావరణ చిత్రాలు ? మున్నం వలవు (మలయాళం) సినిమాపై ఉత్తమ పుస్తకం: లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం: రాజీవ్ విజయకర్ రచించిన ది ఇన్‌క్రెడిబ్లీ మెలోడియస్ జర్నీ ఉత్తమ సినీ విమర్శకుడు: పురుషోత్తమా చార్యులు ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ (ప్రత్యేక ప్రస్తావన): సుబ్రమణ్య బందూర్ అక్షుఎఆ`19 మహమ్మారి కారణంగా అవార్డు వేడుకలు రెండేళ్లు ఆలస్యం అయ్యాయి. 2022లో జరిగిన 68వ జాతీయ చలనచిత్ర అవార్డులు, క్యాలెండర్ ఇయర్ 2020లో విడుదలైన ఉత్తమ భారతీయ చిత్రాలను సత్కరించాయి. తమిళ చిత్రం సూరరై పొట్రు ఉత్తమ చిత్రంగా అత్యున్నత బహుమతిని గెలుచుకుంది,