RRR Movie: RRR ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన జీ 5 సమస్థ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

RRR Movie: దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు యోధులను ఈ చిత్రం ద్వారా కలుపబోతున్నారు జక్కన్న. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ ఈనెల 25వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు.

ఇకపోతే థియేటర్ లో విడుదలైన ప్రతి సినిమా కూడా తిరిగి ఓటీటీలో విడుదల కావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏకంగా 300 కోట్లకు జీ 5 దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఈ సంస్థ దక్కించుకుంది.ఇకపోతే అన్ని సినిమాల మాదిరిగా ఈ సినిమా సినిమా విడుదలైన 6 వారాలకు కాకుండా 90 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, స్పానిష్‌ భాషలకు గాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా 25వ తేదీ విడుదల కావడంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఇదివరకే ముంబైలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ నెల 18, 19 వ తేదీలలో బెంగళూరు దుబాయ్ వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.