జపాన్ లో విడుదల కాబోతున్న దేవర మూవీ.. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ అక్కడికి వెళ్తారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ జంటగా నటించిన సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఎన్టీఆర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తరువాత నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడి ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి.

ఇక తాజా విశేషం ఏమిటంటే ఈ సినిమాని ఇప్పుడు జపాన్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మూవీ మేకర్స్. జపాన్ దేశంలో వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేసేందుకు సన్నహాలు ప్రారంభమయ్యయి. ఇటీవల కల్కి 2898 చిత్రాన్ని జపాన్ లో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్ ఇప్పుడు దేవర చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతుంది. జనవరి 3వ తారీకు నుంచి ఈ సినిమా ప్రి సేల్స్ స్టార్ట్ చేయబోతున్నారు.

త్రిబుల్ ఆర్ సినిమాతో జపాన్లో కూడా మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అక్కడ మన ఎన్టీఆర్ కి హ్యూజ్ మార్కెట్ ఉంది. దాంతో ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు మూవీ యూనిట్. దేవర జపాన్ వెర్షన్ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. సముద్రంలో తిమింగలంతో పోరాటం చేసిన భారతీయ హీరో సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

త్రిబుల్ ఆర్ సినిమా జపాన్ దేశంలో విడుదలైనప్పుడు అక్కడ ప్రమోషన్స్ కోసం రాజమౌళి టీం అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ అక్కడికి వెళ్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ అనుమానానికి దేవర మూవీ టీం ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూడాలి.ఇక జపాన్ లో దేవర సినిమా హిట్ అయితే వేరే దేశాలకు వెళ్లే వెళ్లే ఆలోచనలో దేవర మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. మరి జపాన్ ప్రజలు ఈ సినిమాని ఏ విధంగా ఆదరిస్తారో చూడాల్సిందే.