క్యాపషన్‌ పెడితే..’సలార్‌’కు ఉచిత టిక్కెట్లు

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు, ప్రేక్షకులకు ఓ సువర్ణ అవకాశం! ఆయన నటిస్తున్న తాజా సినిమా ’సలార్‌’ సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడాలని ఆశ పడుతున్నారా? ఆ షోకి ’సలార్‌’ టీ షర్టులు, క్యాప్‌ ధరించి వెళితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అటువంటి వాళ్ళ కోసమే ఈ అవకాశం!

‘సలార్‌’ చిత్రీకరణలో ప్రభాస్కు తన ఫోనులో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఏదో చూపిస్తున్న ఫోటోను చిత్ర బృందం సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసింది. ఆ ఫోటోకి క్యాప్షన్‌ ఇవ్వమని అభిమానులను కోరింది. బెస్ట్‌ క్యాప్షన్‌ ఇచ్చిన టాప్‌ 5 నెటిజనులకు తమ తమ ఏరియాలో ’సలార్‌’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్స్‌ ఇస్తామని పేర్కొంది.

అంతే కాదు… మర్చండైజ్‌ కూడా అందిస్తామని వివరించింది. మరికొన్ని గంటల్లో ’సలార్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది. శుక్రవారం… అనగా డిసెంబర్‌ 1న రాత్రి 7.11 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు. ట్రైలర్‌ విడుదలకు ముందు ఈ ఆఫర్‌ ఇవ్వడమే కాదు… బాలీవుడ్‌ విూడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టోరీ కూడా లీక్‌ చేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌!