FIR on Karate Kalyani: ఎప్పుడూ వివాదాల్లో నిలిచే సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి మరోసారి చిక్కుల్లో పడ్డారు. జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ లో కరాటే కళ్యాణి పైన కేసు నమోదైంది. ఎప్పుడు వివాదస్పద అంశాల్లో ఉంటూ, రోజు వార్తల్లో ఉండే కరాటే కళ్యాణి మరోసారి ఆమె వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఓ హత్య కేసుకు సంబంధించి అత్యాచార బాధితురాలి వివరాలను, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదు రావడంతో జగద్గిరిగుట్ట పోలీసులు కరాటే కళ్యాణి పైన కేసు నమోదు చేశారు.
కొన్నాళ్ల క్రితం సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన హత్య వివరాలను డిస్ క్లోస్ చేసినందుకు కరాటే కళ్యాణి ప్రయత్నిస్తున్నట్ల ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి జగద్గిరిగుట్ట, ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లెయింట్ దాఖలు చేశారు. కరాటే కళ్యాణి పైన వెంటనే కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని రంగా రెడ్డి కోర్టు ఆదేశించింది. దీంతో కోర్ట్ ఆదేశాల ప్రకారం కరాటే కళ్యాణి పై జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.