‘బూతు’కి ట్విట్టర్ ఇకనైనా బ్రేకులేస్తుందా.?

Will Twitter Ban 'P*rn' In India

Will Twitter Ban 'P*rn' In India

ట్విట్టర్ మీద భారతదేశంలో కుప్పలు తెప్పలుగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ మీద ‘ఎఫ్ఐఆర్’ రిజిస్టర్ చేశారు. పిల్లలకు సంబంధించి పోర్నోగ్రాఫిక్ కంటెంట్ కలిగి వుండడాన్ని ప్రశ్నిస్తూ, ట్విట్టర్ మీద కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలసులు. అయితే, ట్విట్టర్ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది.

ట్విట్టర్ ఆ తరహా పోర్న్ కంటెంట్ మీద ఎప్పుడూ నిఘా పెట్టి, ఆ వీడియోల్ని ఎప్పటికప్పుడు తొలగిస్తుంటుందని పేర్కొంది సంస్థ యాజమాన్యం. అయితే, ట్విట్టర్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో పోర్న్ కంటెంట అనేది విచ్చలవిడిగా సంచరిస్తోందన్నది ఓపెన్ సీక్రెట్.

గత కొన్నేళ్ళుగా మొబైల్ పోన్లలోకి అత్యంత వేగంగా, అత్యంత సులభంగా పోర్న్ కంటెంట్ వచ్చిపడుతోంది. దీనికి ప్రధాన కారణం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల మీద కేంద్రం సరైన నిఘా పెట్టకపోవడమే. ‘బూతు చూస్తే నేరం’ అని కేంద్రం గనుక, ఆదేశాలు జారీ చేయగలిగితే.. భారతదేశంలో ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య అనూహ్యంగా పడిపోతుంది.

కానీ, మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా బూతు కంటెంట్ కోసమే అన్నట్టు తయారైంది పరిస్థితి గనుక.. ఇంటర్నెట్ ప్రొవైడర్స్ నుంచి వచ్చే ఒత్తిళ్ళకు పాలకులు తలొగ్గక తప్పడంలేదేమో. ‘ఎఫ్ఐఆర్’ నమోదయ్యింది గనుక, ఈ వ్యవహారాన్ని కేవలం ట్విట్టర్ అనే ఒక్క సామాజిక మాధ్యమ సంస్థకే పరిమితం కాకుండా, మొత్తంగా ఇంటర్నెట్ వేదికగా వచ్చే బూతు కంటెంట్ మీద యుద్ధంగా చూస్తే మంచిది. కానీ, అంత చిత్తశుద్ధిని మన పాలకుల నుంచి ఆశించలేం.