‘దేవర’ ట్రైలర్‌పై అభిమానుల పెదవివిరుపు.. ‘ఆచార్య’లో సీన్స్‌ రిపీట్‌ అంటూ.. పోస్ట్‌లు!!!

ఎంతో మంది అభిమానులు చాలాకాలంగా ఎదురు చూసిన జూ.ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా ట్రైలర్‌ మంగళవారం రిలీజైంది. అయితే సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలను ఈ ట్రైలర్‌ బాగా నిరుత్సాహ పర్చింది. దీంతో కొరటాల శివ కేజీఎఫ్‌ పార్మాట్‌ లో ఈ సినిమా తీద్దామనుకున్నాడు.. కానీ అది ‘ఆచార్య’లానే అయిందనిపిస్తూందంటూ విూమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. గతంలో ‘ఆచార్య’ సినిమాలోని సన్నివేశాలను, ‘దేవర’ ట్రైలర్‌లోని సన్నివేశాలను కంపేర్‌ చేస్తూ మరీ ట్రోలింగ్‌ చెయడం విశేషం.

అయితే.. ‘ఆచార్య’ సినిమా అనంతరం దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చెయాల్సి ఉంది. ఆ సినిమాను తొలుత ఎనౌన్స్‌ చేశారు కూడా. అయితే అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్‌ అవటం.. సడెన్‌గా ఎన్టీఆర్‌తో కొరటాల శివ సినిమా ఫిక్స్‌ అవటం వెంటనే జరిగిపోయింది. ‘ఆచార్య’ సినిమా ఫలితం, దాని తదనంతరం చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్‌.. కొరటాల ఇమేజ్‌ను కంప్లీట్‌గా దెబ్బతీసిన పరిస్దితి కనిపించింది. ఈ క్రమంలో కొరటాల శివ తానేంటో మరలా నిరూపించుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఎన్టీఆర్‌ కొరటాల శివపై నమ్మకంతో ‘దేవర’ చేసే అవకాశం ఇచ్చినపుడు.. అభిమానుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది కాలంగా ‘దేవర’ సినిమా చిత్రీకరణ జరగటం.. ఈ సినిమా ఓపెనింగ్‌ మొదలు.. కాస్టింగ్‌ సెలెక్షన్‌.. రెండు పార్టులుగా సినిమాను ప్రకటించటం.. ఇలా నిదానంగా ‘దేవర’పై హైప్‌ క్రియేట్‌ అయిందనుకున్న క్రమంలో ట్రైలర్‌ రిలీజ్‌ అయి ‘దేవర’పై ఉన్న పాజిటివ్‌ బజ్‌ను కాస్త డిస్ట్రబ్ చేసినట్లు కన్పిస్తోంది.

కొరటాల మాత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా తరహాలోనే ‘దేవర’ సినిమాను, ఎన్టీఆర్‌ పాత్రను డిజైన్‌ చేయటం బాలేదంటూ సోషల్‌ విూడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. కొంతమంది ట్రైలర్‌పై తీవ్ర స్థాయిలో మండి పడుతూ ఇది మరో బచ్చన్‌ అవుతుందంటూ వీడియోలు చేసి యూ ట్యూబ్‌లో పెడుతున్నారు. అంతేకాదు.. దేవరట్రైలర్‌ చూశాక, నిర్మాణ విలువలు భారీగా ఉన్నా.. కంటెంట్‌.. ఏమాత్రం ఆసక్తికరంగా లేదని.. ఎన్టీఆర్‌ కొరటాలకు ఛాన్స్‌ ఇచ్చి తప్పు చేశాడా అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ విూడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు.