తగ్గేది లే అన్న ‘షణ్ముఖ్’… తప్పించేసిన బిగ్ బాస్

‘షణ్ముఖ్ జస్వంత్’… యూట్యూబ్ స్టార్ గా అనతికాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు. యూట్యూబ్లో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కొంత ఫేమ్ సంపాదించిన షణ్ముఖ్ కు గతేడాది లాక్ డౌన్ సమయంలో విడుదలైన ‘సాప్ట్‏వేర్ డెవలపర్’ సీరిస్‏ సూపర్ సక్సెస్ అవటంతో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అదే జోరులో తీసిన ‘సూర్య’ వెబ్ సిరీస్‌ కూడా సక్సెస్ అయ్యింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా షణ్ముఖ్ పేరు మారుమ్రోగుతుంది. అంతేకాకుండా అతి త్వరలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కోసం మంచి ఆఫర్ వచ్చిందని డీల్ సెట్ అయ్యిందని వార్తలు హల్ చల్ చేశాయి.

Big Boss Management Said No To Shamukh Demand
 

ఇంకేముంది… బిగ్ బాస్-5 సీజన్ కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్ ఉన్నాడని నిన్నటివరకు అందరూ భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్-5 సీజన్ లో షణ్ముఖ్ ను తీసుకోలేదట. పారితోషకంగా షణ్ముఖ్ దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేయగా బిగ్ బాస్ యాజమాన్యం బేరసారాలు చేసింది. అయితే అతగాడు పారితోషకం విషయంలో తగ్గేది లే… అంటూ పట్టుబట్టాడట. అంత మొత్తం ఇవ్వలేమని తేల్చేసిన బిగ్ బాస్ లిస్ట్ నుండి షణ్ముఖ్ పేరును తొలగించేశారట. అతని ప్లేస్ లో మరొకరిని ఎంపిక చేస్తున్నారని సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్-5 సెప్టెంబర్ నెల రెండవ వారంలో స్టార్ మా ఛానెల్ లో స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles