ఆ అగ్రనటుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు…

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ అనే మాట మళ్ళీ వినిపిస్తోంది. తమిళ నటి విచిత్ర తమిళ బిగ్‌ బాస్‌ హౌస్‌ లో వుంది. ఆమె పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడుతూ ఒక తెలుగు అగ్ర నటుడు అతని రూమ్‌ కి రమ్మని చెప్పాడని, ఆమె తిరస్కరించండంతో ఆ సినిమా షూటింగ్‌ లో ఎటువంటి ప్రొబ్లెమ్స్‌ ఆమె ఎదుర్కొంది అనే విషయాలు ఇప్పుడు బయట పెట్టింది. ఆమె ఈ విషయాలని హౌస్‌ లో వున్న మిగతా సభ్యులతో పంచుకుంటూ ఈ సంఘటన 2001 లో జరిగిందని చెప్పింది. విచిత్ర 2001 లో ఒక సినిమా షూటింగ్‌ లో పాల్గొంది అని చెప్పింది.

ఈ షూటింగ్‌ కేరళ దగ్గర అవుట్‌ డోర్‌ లో జరిగింది. త్రి స్టార్‌ హోటల్‌ ఇచ్చారని, షూటింగ్‌ అయినా తరువాత పార్టీ కి వెళితే, అప్పుడు ఆ సినిమాలో మెయిన్‌ హీరో కలిసాడని, అతను నేరుగా విచిత్ర దగ్గరకి వచ్చి ’రాత్రికి నా రూమ్‌ కి వచ్చేయి’ అని చెప్పాడని విచిత్ర షాకింగ్‌ విషయం బయటపెట్టింది. అతను తన పేరు కూడా కనీసం అడగలేదు అని, నేరుగా ’ చెప్పాడని చెప్పింది విచిత్ర. అయితే విచిత్ర అతని రూమ్‌ కి పోకుండా, నేరుగా తన రూమ్‌ కి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్లకపోవడంతో రోజూ ఆమెని ఆ అగ్ర నటుడు వేధించాడు అని కూడా విచిత్ర ఇంకో షాకింగ్‌ విషయం బయటపెట్టింది. అప్పుడే వివాహం కూడా చేసుకున్నానని, కానీ వివాహం అయ్యాక సినిమాలు మానేసాను అని అందరూ అనుకున్నారని, కానీ తనకి ఆ అగ్రనటుడు వలన జరిగిన ఆ సంఘటనతో సినిమాలు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాను అని చెప్పింది విచిత్ర.

చాలా సంవత్సరాల తరువాత విచిత్ర తమిళ బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి సభ్యురాలిగా వచ్చింది. హౌస్‌ లో జరిగిన ఒక చర్చలో భాగంగా విచిత్ర తనకి జరిగిన ఈ షాకింగ్‌ సంఘటనని బయట పెట్టింది. అప్పుడు ఆ హోటల్‌ మేనేజర్‌ తనని ఆదుకున్నాడని, తరువాత అతనే తనకి భర్త అయ్యాడని చెప్పుకొచ్చింది విచిత్ర. తెలుగు అగ్ర నటుడు తనని రూమ్‌ కి రమ్మన్న విషయం, తాను వెళ్లకపోవటంతో అతను రోజూ తాగి ఎలా వేధించాడు, మిగతా యూనిట్‌ సభ్యులు కూడా ఆ నటుడికి పత్తాసు పలికిన విషయం నడిగర్‌ సంఘం కి ఫిర్యాదు చేస్తే సంఘం అధ్యక్షుడు ’లైట్‌ తీసుకో’ అని చెప్పాడన్న విషయం కూడా బయటపెట్టింది విచిత్ర. ఆ సంఘటన తరువాత తాను సినిమాలు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నట్టుగా చెప్పింది విచిత్ర.