కిరణ్‌ అబ్బవరం పెట్టిన పోస్టు వైరల్‌.. నెటిజన్లు పెట్టిన పోస్టులకు షాక్‌!

ముందు చెప్పినట్లుగానే బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ఉల్టా పల్టాలా సాగుతుంది. ఇప్పటికే 4 వారాలు పూర్తయిపోయాయి. అయితే మూడు వారాల నామినేషన్‌ల కంటే నాలుగో వారం నామినేషన్‌ కోసం బిగ్‌ బాస్‌ లవర్స్‌ తెగ వేయిట్‌ చేశారు. అందుకు ముఖ్యం కారణం రతిక .టైటిల్‌ హాట్‌ ఫేవరైట్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రతిక నాలుగో వారం ఎలిమినేట్‌ అయింది.

పల్లవి ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడవడం, యావర్‌ను కంటెండర్‌గా, హౌజ్‌మేట్‌గా చూడాలని అతనికి చెప్పి.. కన్ఫెషన్‌ రూమ్‌లో మాత్రం వ్యతిరేకంగా మాట్లాడటం, హౌజ్‌లో లవ్‌ ట్రాక్స్‌ నడపడం.. ఇలా అవసరానికి మాత్రమే వాడుకునే లక్షణాలు ఉండటం వంటి పలుకారణాలతో రతిక ఎలిమినేట్‌ అయింది. ఇదిలా ఉంటే.. రతికపై టాలీవుడ్‌ కుర్ర హీరో కిరణ్‌ అబ్బవరం పెట్టిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

కిరణ్‌ అబ్బవరం తాజాగా నటిస్తున్న చిత్రం రూల్స్‌ రంజన్‌. రుథిరమ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌ 06న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ అప్‌డేట్‌లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి కిరణ్‌ అబ్బవరం ట్విట్టర్‌లో ఆన్‌లైన్‌ చాట్‌ సెషన్‌ నిర్వహించాడు.

అయితే ఈ చాట్‌ సెషన్‌లో ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. రూల్స్‌ రంజన్‌ హిట్‌ అయ్యాకా బిగ్‌ బాస్‌ ఫేమ్‌ రతిక లాంటి అమ్మాయితో నీకు పెళ్ళవ్వాలి కోరుకుంటున్నా అంటూ కామెంట్‌ చేశాడు. దీనిపై కిరణ్‌ అబ్బవరం రిప్లయ్‌ ఇస్తూ.. ‘’బాబు గుడుంబా ఎందుకమ్మా నా విూద నీకు అంత పగ. పెళ్లి అయితే చేసుకుందాం కానీ.. రాని ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం’’ అంటూ రిప్లయ్‌ ఇచ్చాడు. ఇక కిరణ్‌ పెట్టిన ఈ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతుంది.