సుకుమార్‌తో బాలకృష్ణ సంప్రదింపులు.. దేనికోసం.?

తన కుమారుడ్ని హీరోగా పరిచయం చేసేందుకు నందమూరి బాలకృష్ణ తనదైన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. 2023లో ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షజ్ఞ తెరంగేట్రం చేసేస్తాడట. ఆ దిశగా నందమూరి బాలకృష్ణ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. చేతిలో బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వున్నాగానీ, బాలకృష్ణ వేరే ఆప్షన్స్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి అనుగుణంగా యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా అయితే బావుంటుందన్న ఆలోచనలో బాలయ్య వున్నారట మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించి.

తాజాగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తోనూ బాలయ్య సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. సుకుమార్ ప్రస్తుతానికైతే ఖాళీగా లేడు. ‘పుష్ప ది రూల్’ సినిమా పనుల్లో చాలా చాలా బిజీగా వున్నాడు. కానీ, సుకుమార్ శిష్యుల్లో చాలామంది టాలెంటెడ్ అప్‌కమింగ్ డైరెక్టర్స్ వున్నారు. పైగా, సుకుమార్ తన కథల్ని తన శిష్యుల ద్వారా డెవలప్ చేయిస్తుంటాడు. అలాంటి కథ ఏదైనా దొరికినా చాలన్న భావనలో బాలయ్య వున్నాడట. ఆ ఉద్దేశ్యంతోనే సుకుమార్‌తో బాలయ్య సంప్రదింపులు షురూ చేశాడని వినికిడి.