గత మూడు నాలుగు రోజులుగా లాస్య వ్యవహారం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. లాస్య యూట్యూబ్ చానెల్ హ్యాక్ అవ్వడం, అందులోని వీడియోలన్నీ పోవడం, ఇలా మొత్తం గందరగోళంగా మారడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తన యూబ్యూట్ చానెల్ హ్యాక్ అయిందంటూ లాస్య ఫేస్ బుక్‌లో ఎమోషనల్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఎందుకు జరిగిందో ఎలా ఎప్పుడు జరిగిందో కూడా సరిగ్గా తెలియడం లేదంటూ లాస్య ఎమోషనల్ అయింది.
తాను ఎంతో కష్టపడి చేసిన వీడియోలన్నీ పోయాయ్.. తన టీం అదే పనిలో ఉంది.. మళ్లీ యూట్యూబ్ చానెల్‌ను వెనక్కి తెచ్చే పనిలో పడింది.. మళ్లీ నా చానెల్ నాకు వస్తుందని చెబుతున్నారు.. కానీ కాస్త సమయం పట్టేలా ఉంది.. వచ్చాక మళ్లీ ఓ వీడియోను చేస్తాను అంటూ లాస్య కన్నీరు పెట్టుకున్నంత పని చేసేసింది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. హారిక నోయల్ కలిసి లాస్యను లైవ్‌లో ఆడుకున్నారు.
పది వేలు ఇస్తే అకౌంట్ రిటర్న్ చేస్తారట.. అంటూ నోయల్ ఆడుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా లాస్య మాత్రం ఓ గుడ్ న్యూస్ చెప్పేసింది. యూట్యూబ్ చానెల్ తిరిగి తన చేతుల్లోకి వచ్చిందట. నా చానెల్ బ్యాక్ వచ్చేసింది.. లాస్య టాక్స్ అంటూ గంతులు వేసింది. ఆమె ఆనందం మొత్తం నవ్వులో, కళ్లలో కనిపిస్తోంది. మొత్తానికి మళ్లీ వీడియోలతో రచ్చ చేసేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. నోభికస్య (నోయల్, అభి హారిక లాస్య)తో ఓ వీడియో ప్లాన్ చేస్తాను అని చెప్పింది.