బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే…దివ్య బర్త్డే పార్టీకి తయారయ్యి తులసి వద్దకు వెళ్ళగా తనకు స్పెషల్ క్లాస్ ఉందని చెప్పడంతో తులసి ఇన్ఫామ్ చేయకుండా స్పెషల్ క్లాస్ ఏంటి అని సందేహాలు వ్యక్తం చేస్తుంది. అదే సమయంలో లాస్య అక్కడికి వచ్చి ఏదో ఒకటి మేనేజ్ చేసి దివ్యను అక్కడి నుంచి పంపిస్తుంది. ఇలా దివ్య పార్టీకి వెళ్లి స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అయితే పార్టీలో ఉన్న కొందరు అబ్బాయిలు దివ్య తాగే కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తనకు కూల్ డ్రింక్ ఇస్తారు.
దివ్య పార్టీకి వెళ్లి ఇంకా రాకపోయేసరికి లాస్య కంగారుపడుతుంది గంటలో వస్తానని చెప్పి వెళ్లిన దివ్య ఇంకా రాలేదు ఇంట్లో వారికి ఈ విషయం తెలిస్తే నేను ఉత్తమ ఇల్లాలు కాదు కదా ఈ ఇంటి నుంచి నన్ను బయటికి పంపిస్తారని కంగారుపడుతుంది.అదే సమయంలోనే దివ్యకు ఫోన్ చేయగా ఒక గంట పడుతుంది ఎలాగో అలాగా మ్యానేజ్ చేయండి ఆంటీ అని చెబుతుంది.మరోవైపు దివ్యవెల్లి ఆలస్యమైన ఇంకా రాకపోయేసరికి తులసి కూడా కంగారుపడుతుంది అంకిత తులసి ఎవరు ఫోన్ చేసినా దివ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోవైపు లాస్య కూడా ఇదంతా తన వల్లే జరిగింది అని తెలిస్తే ఇక నా పని గోవిందా అంటూ కంగారుపడుతుంది.
అంతలోపే దివ్య కూల్డ్రింక్ తాగి మత్తు రావడంతో తూలుతూ ఉంటుంది.ఇక నందు కూడా దివ్య కోసం ఫోన్ చేస్తూ ఉంటాడు అయితే అదే సమయంలో లాస్య వెళ్లి తాను స్పెషల్ క్లాస్ కి కాదు బర్త్డే పార్టీకి వెళ్లిందని తనని నేనే పంపించానని చెప్పడంతో ఒక్కసారిగా నందు లాస్య పై చేయి పైకెత్తుతాడు.అంతలోపు ప్రేమ్ వచ్చి దివ్య స్పెషల్ క్లాస్ కి కాదు వెళ్ళిందని చెప్పడంతో మరింత కంగారు పడతారు.అదే సమయంలో నందు తులసి వద్దకు వచ్చి నువ్వు నీలా ఉండాల్సింది తనని ఎందుకు పంపించావు అని అడగడంతో తను స్పెషల్ క్లాస్ ఉందని చెప్పింది అనగా తనకు స్పెషల్ క్లాస్ లేదు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ కి వెళ్ళింది అని నందు చెబుతాడు.
తను బర్త్డే పార్టీకి వెళ్లిందని మీకు ఎలా తెలుసు అనడంతో లాస్య చెప్పిందని నందు అసలు విషయం చెప్పేస్తాడు.తాను తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది వెళ్లాలి అనడంతో తానే స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి వెళ్ళమన్నానని లాస్య చెప్పడంతో ఇప్పటివరకు దివ్య నా దగ్గర అబద్ధం చెప్పలేదు అది కూడా జరిగిపోయింది అంటూ తులసి లాస్య పై కోపడుతుంది. మరి దివ్య రాకపోవడంతో తులసి ఇతర కుటుంబ సభ్యులు కూడా దివ్య కోసం కంగారుపడుతూ ఉంటారు.