క్షేమంగా బయటపడిన దివ్య…. పనిమనిషి అవతారం ఎత్తిన లాస్య!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే…దివ్య ఇంటికి రాకపోయేసరికి అందరూ కంగారుపడుతూ తనని వెతకడానికి వెళ్తారు. ఈ క్రమంలోనే నందు తన పోలీస్ ఫ్రెండుని తీసుకొని లోకేషన్ షేర్ చేయడంతో ట్రేస్ చేస్తూ వెళ్తారు అంతలోపు ప్రేమ్, తులసి దివ్య ఉన్నచోటకు వెళ్తారు వీరిని చూసి దివ్య స్నేహితుడు చేతన్ పారిపోతుండగా ప్రేమ్ తనని పట్టుకొని చితక్కొడతాడు. మరోవైపు తులసి లోపలికి వెళ్లి కార్తీక్ ని పట్టుకొని చివాట్లు పెట్టి దివ్వను కాపాడుతుంది. తన తల్లిని చూడగానే దివ్య అబద్ధం చెప్పి పార్టీకి వచ్చాను తప్ప నేను ఏ తప్పు చేయలేదని అనడంతో నా కూతురుపై నాకు నమ్మకం ఉందని దివ్యకు ధైర్యం చెబుతుంది.

అంతలోపు నందు పోలీస్ అక్కడికి రావడంతో వారిని పోలీసులకు పట్టిస్తారు. అయితే వారి భవిష్యత్తు నాశనం అవుతుంది కంప్లైంట్ చేయవద్దని చెప్పినప్పటికీ తులసి కాసేపు క్లాస్ పీకే వారిని పోలీసులకు అప్పగిస్తుంది. దివ్య పేరు బయటికి రాకుండా చూసుకోవాలని బ్రతిమలాడుతుంది. తులసి దివ్యని తీసుకొని ఇంటికి పోగా ఇంట్లో అందరూ కూడా దివ్వను చూసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. వెంటనే అనసూయ అమ్మ దివ్య అంటూ దగ్గరికి వెళ్ళబోతుండగా జరిగింది తలుచుకొని దివ్య వణికిపోతూ తన తల్లితో పాటు గదిలోకి వెళుతుంది.

దీంతో తులసి ఏం జరిగింది ఎందుకు ఏంటి అనే విషయాలు ఎవరూ నిన్ను అడగరు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు కూడా ఏమి చెప్పకు అంటూ తులసి తనకు ధైర్యం చెబుతుంది. అలాగే ఇంట్లో వారికి కూడా తనని ఎవరు ఏమీ అడగవద్దని చెప్పేస్తుంది.కొద్దిసేపటికి తులసి దివ్య కోసం భోజనం తీసుకువెళ్లగా దివ్య తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అడుగుతుంది. అయితే తులసి మాత్రం నువ్వు బయటకు వెళ్లిన ప్రతిక్షణం నేను నీకోసం ఎందుకు ఫోన్ చేస్తానో ఇప్పుడైనా అర్థమైందా అంటూ దివ్యకు కాసేపు క్లాస్ తీసుకుంటుంది.

బయటకు వచ్చిన తర్వాత తులసి లాస్య వంక చూస్తూ నువ్వు నా పిల్లల జోలికి అస్సలు రాకు నా పిల్లలు జోలికి వస్తే పడుగు విప్పిన త్రాచుల నీ పైకి వస్తాను అంటూ తనకు వార్నింగ్ ఇస్తుంది.ఇప్పుడు దివ్యకు ఏం కాలేదు కాబట్టి బ్రతికి పోయావు తనకు ఏదైనా జరగరానిది జరిగి ఉంటే నీ సంగతి అప్పుడు చెప్పేదాన్ని అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం లాస్య ఏకంగా తులసి అవతారం ఎత్తి ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది. అయితే నందు తనని చూసి కాఫీ కావాలని అడగడంతో లాస్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.